Kalki 2 రిలీజ్‌పై నిర్మాత అశ్వినీదత్ క్లారిటీ.. ఆ మూడు పాత్రలు చాలా కీలకం..
Kalki 2: 2024లో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో కల్కి 2898 ఏ ఒకటి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారడంతో దీనికి సీక్వెల్ గా కల్కి పార్ట్ 2 రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా..ప్రొడ్యూసర్ అశ్వనీదత్(Ashwini Dutt) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'కల్కి 2' పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఏమన్నారంటే..
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూళ్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద ఒక కొత్త మార్కును స్థాపించింది. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కర్ణుడిగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అలాగే.. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని లాంటి స్టార్ సెలబ్రిటీలు ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ కృష్ణుడి దశావతారంలోని చివరి అవతారం అయినా కల్కి అవతారం ఆధారంగా రూపొందించిన సైన్స్ పిక్షన్ మూవీ ఈ కల్కి 2898 ఏడి. హిందూ పురాణాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తూ ఈ సినిమాని రూపొందించారు. ప్రభాస్ బౌంటీ ఫైటర్ భైరవగా, చివర్లో కర్ణుడిగా తన అద్భుతమైన నటనతో అదరగొట్టి, పార్ట్ 2 పై అంచనాలను మరింత పెంచాడు. ఈ భారీ బ్లాక్ బ్లాస్టర్ మూవీకి సీక్వెల్ గా కల్కీ 2 సినిమా తెరక్కెతున్న విషయం తెలిసిందే..
ప్రొడ్యూసర్ అశ్వినీ దత్తు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి 2 వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, కల్కి 1 కంటే కల్కి 2 మరింత అద్భుతంగా ఉంటుందని అందులోని మలుపులను ఎవరు ఊహించలేరని పేర్కొన్నారు. రెండో భాగంలో కమలహాసన్ పాత్ర ప్రధానంగా ఉండబోతుందని, ఈ పార్టీలో ప్రభాస్, కమల్ హాసన్ మధ్య చాలా ఇంపార్టెంట్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలిపారు. అలాగే.. బాలీవుడ్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ దీపికా పదుకొనే పాత్ర కూడా చాలా కీలకమైందని ఈ పాత్రలు సినిమాకు ప్రధాన అస్త్రాలు అని పేర్కొన్నారు.

కొత్త నటులను తీసుకోవడం గురించి తాను ఏం చెప్పలేనని, కానీ.. కథకు అవసరమైతే కొత్త యాక్టర్స్ ను తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నాగ్ అశ్విన్ గురించి అశ్విని దత్తు మాట్లాడుతూ.. మహానటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో ఇండస్ట్రీకి చూపించాడని, ఆ సినిమా విజయం తర్వాత తెరకెక్కించిన కల్కి సినిమా ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. ఈ రెండు సినిమాలను చూస్తే.. ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని, నాకు అశ్విన్ జీవితంలో ఎలాంటి ఓటమి ఉండదని, తాను నమ్ముతానని ప్రొడ్యూసర్ అశ్విని దత్ భావించారు.
నాగ్ అశ్విన్ ఆలోచన విధానం ఆయన టేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు కాబట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ నయా రికార్డులతో ప్రభాస్ సినీ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.


Click it and Unblock the Notifications











