రేవంత్ సర్కార్‌పై భగ్గుమన్న నాగ్ అశ్విన్.. వివాదాల్లోకి కల్కి 2898 AD దర్శకుడు!
దాదాపు ఏ సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఎలాంటి కాంట్రవర్సీ లలో ఇరుక్కోకూడదు అనే అనుకుంటారు. మెయిన్ గా మన తెలుగు సినిమాలో కూడా చాలా మంది హీరోలు లేదా హీరోయిన్స్ ఇంకా నిర్మాత దర్శకులు కాంట్రవర్సీలు వివాదాలకు దూరంగానే ఉండే ప్రయత్నం చేశారు. అలాగే తమ సినిమాల్లో పలు అంశాలని రైజ్ చేస్తారు కానీ నిజ జీవితంలో మాత్రం బయటకొచ్చి పోరాడిన హీరోలు కానీ దర్శకులు కానీ పెద్దగా కనిపించరు.
కానీ ఇపుడు ఓ సెన్సేషనల్ దర్శకుడు మాత్రం సినీ వర్గాల్లో సంచలనంగా మారాడు. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో 1100 కోట్లు సినిమా కల్కి 2898 ఎడి లాంటి భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్తగా వివాదాల్లో కనిపించడం అనేది చర్చకు దారి తీసింది. కాగా మన తెలుగు సినిమాలో న్యూ ఏజ్ దర్శకులలో నాగి కూడా ఒకరు కాగా తన విజన్ తో కల్కి సినిమా తెరకెక్కించి పాన్ ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేసాడు.

అయితే బయట ఎంతో నెమ్మదిగా కనిపించే నాగ్ అశ్విన్ ఎప్పుడూ కాంట్రవర్సీ లకి దూరంగానే ఉండేవారు. కానీ లేటెస్ట్ గా మాత్రం తాను చేస్తున్న పోస్ట్ లు టాలీవుడ్ ఆడియెన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కాగా తాను నేరుగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే ప్రశ్నించడం అనేది వైరల్ గా మారింది. ప్రస్తుతం తెలంగాణాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
అక్కడ ఉన్న అనేక ఎకరాల అడవిని తీసివేయడంపై పర్యావరణానికి హాని జరుగుతుంది అని పలు విమర్శలు పెద్ద ఎత్తు కూడా వినిపిస్తున్నాయి. ఇలా అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి సహా ప్రభుత్వ అధికారుల నడుమ వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటనలపై ఒక్క దర్శకుడు నాగ్ అశ్విన్ మాత్రం గొంతెత్తడం అనేది సినీ వర్గాల్లో సహా రాజకీయాల్లో కూడా వైరల్ గా మారింది.
చాలా మంది హీరోలు దర్శకులు సినిమాల్లో మాత్రమే ఇలా ప్రశ్నిస్తారు అని నాగ్ అశ్విన్ మాత్రమే ఇపుడు ఇలాంటి వాటిపై స్పందించడం అనేది గొప్ప విషయం అంటూ నెటిజన్స్ తనని కొనియాడుతున్నారు. కాగా ఇంకోపక్క నాగ్ అశ్విన్ గట్స్ కి ప్రశంసలు వస్తుండగా మరికొందరు మాత్రం నాగ్ అశ్విన్ కి పర్శనల్ గా పాలిటిక్స్ వరకు కొందరికి ఫెవర్ గా ఉంటాడని అందుకే ప్రస్తుతం తాను ఈ స్టెప్ తీసుకున్నాడు అంటూ పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఫైనల్ గా మాత్రం ఒక పర్యావరణ ప్రేమికుడిగా మాత్రం నాగ్ అశ్విన్ పై పలు ప్రశంసలు కొనసాగుతున్నాయి. కాగా ఇవి పక్కన పెడితే నాగ్ అశ్విన్ తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం కల్కి 2898 ఎడి పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











