1000 కొట్టాలంటే అలాంటి సీన్స్ అవసరమా? సందీప్ రెడ్డి వంగకు నాగ్ ఆశ్విన్ కౌంటర్! కేనా?

ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర తెలుగు సినిమా కానీ తెలుగు దర్శకులు కానీ తమ సత్తా ఏ రేంజ్ లో చూపిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. కాగా ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హిందీ మార్కెట్ కి వెళ్లి మరీ భారీ వసూళ్లు కొల్లగొట్ట గలిగే సినిమాలు చేస్తున్నారు. అయితే మన వాళ్ళని చూసి ఇతర ఇండస్ట్రీ నిర్మాతలు, దర్శకులు కూడా కొందరు ఆహ్వానిస్తున్నారు, కొందరు తీసుకోలేకపోతున్నారు..

ఇది సాధారణమే కానీ మన తెలుగు దర్శకులు లోనే ఒకరంటే ఇంకొకరికి పడడం లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ బ్లడ్ లో సందీప్ రెడ్డి వంగ పేరు ఇప్పుడు తెలియని ఇండియన్ సినిమా అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో కొడితే రీసౌండ్ బాలీవుడ్ లో వచ్చింది దీనితో కొన్నేళ్ల పాటు మాకే సినిమాలు చేయాలని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు లాక్ చేసేసారు.

kalki 2898 ad director Nag Ashwin counter to sandeep reddy vanga s Animal on 1000 crores collections

కాగా వారితో రీసెంట్ గా చేసిన సినిమానే "ఆనిమల్". ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎలాంటి విధ్వంసం సృష్టించిందో తెలిసిందే. తెలుగులో అయితే ఏకంగా 100 కోట్ల దగ్గర గ్రాస్ ని ఈ సినిమా అందుకొని బాలీవుడ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది. అయితే వరల్డ్ వైడ్ గా సినిమా సుమారు 1000 కోట్ల దగ్గరకి వెళ్ళింది. కానీ సందీప్ సినిమాలు అంటే వైలెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైలెన్స్ కానీ అడల్ట్ బోల్డ్ సీన్స్ కానీ అంతే హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి.

కానీ ఇప్పుడు వీటిపైనే మరో టాలీవుడ్ యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ పెట్టిన పోస్ట్ అంటూ ఒకటి వైరల్ గా మారింది. కాగా నాగ్ అశ్విన్ చేసిన తాజా చిత్రం "కల్కి 2898 ఎడి". ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఈ సినిమా చేస్తే ఇది 1000 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇక ఇలా అందుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ లో నాగ్ అశ్విన్ పెట్టిన స్టోరీ వైరల్ అయ్యింది.

kalki 2898 ad director Nag Ashwin counter to sandeep reddy vanga s Animal on 1000 crores collections

ఓ సినిమా 1000 కోట్లు కొట్టాలంటే అనవసర రక్తపాతం అవసరం లేదు, అడల్ట్ సీన్స్ అంతకంటే అవసరం లేదు అంటూ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. దీనితో ఇది సందీప్ రెడీడ్ వంగనే టార్గెట్ చేసినట్టుగా ఉందని ఒక్కసారిగా సోషల్ మీడియాలో మేటర్ పొక్కింది. దీనితో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. కాగా వెంటనే నాగ్ అశ్విన్ ఆ పోస్ట్ ని డిలీట్ చేసాడు కానీ జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఒక పక్క సందీప్ అభిమానులు నాగ్ అశ్విన్ పై ఫైర్ అవుతున్నారు. కల్కి లో భారీ కాస్ట్, భారీ బడ్జెట్, మైథలాజి బ్యాక్ డ్రాప్ లాంటివి పెట్టుకుని 1000 కోట్లు కొట్టారు.

కానీ ఆనిమల్ లో అలాంటివి ఏవి లేకపోగా కల్కిలో సగం కూడా బడ్జెట్ కాని సినిమాతో సందీప్ 1000 కోట్లు దగ్గర సినిమా చేయగలిగాడు ఎవరు గొప్ప అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై నాగ్ అశ్విన్ ఏమన్నా వివరణ ఇస్తాడేమో అనేది చూడాలి. ఇంట్రెస్టింగ్ నాగ్ అశ్విన్ తో వర్క్ చేసిన ప్రభాస్ తన తదుపరి సినిమాల్లో సందీప్ రెడ్డి వంగతో "స్పిరిట్" కి కూడా వర్క్ చేయనున్నాడు. తన దర్శకుల విషయంలోనే ఇలా జరగడం అనేది ఆశ్చర్యంగా ఉంది.

More from Filmibeat

Read more about: prabhas kalki 2898 ad nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X