బాలీవుడ్ క్రిటిక్స్‌కు కల్కి నిర్మాతలు షాక్.. 25 కోట్ల నష్టం దావా.. లీగల్ నోటీసులు.. ఏం జరిగిందంటే?

ఇటీవల పాన్ ఇండియా సినిమా దగ్గర ఒక విధ్వంసకర హిట్ సినిమాగా అవతరించిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం "కల్కి 2898 ఎడి" అనే చెప్పి తీరాలి. కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ తో ఇండియన్ సినిమా దగ్గర అలాగే తెలుగు సినిమా నుంచి కూడా మరో 1000 కోట్ల సినిమా డెలివర్ అయ్యింది.

కాగా పలు చిత్రాలకి కానీ బాగా ఫేమ్ తెచ్చుకుంటున్న హీరోస్ విషయంలో కానీ పూలతో పాటుగా రాళ్ళూ పడడటం సర్వ సాధారణం. కానీ అది వాంటెడ్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి పర్యవసానం తప్పనిసరి. కాగా ఇప్పుడు కల్కి సినిమా విషయంలో మేకర్స్ అదే చేస్తున్నారు. ఇలాంటి భారీ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో అటెన్షన్ తెచ్చేసుకుందాం అని ప్లాన్ చేసిన ఇద్దరు బాలీవుడ్ క్రిటిక్స్ కి ఇప్పుడు కల్కి మేకర్స్ ఒక ఊహించని షాకిచ్చినట్టుగా తెలుస్తుంది.

kalki 2898 ad makers gave big shock to bollywood critics and demanding 25cr

కాగా బాలీవుడ్ సంబంధించి సోషల్ మీడియాలో సుమిత్ కడెల్, రోహిత్ జైస్వాల్ అనే ఇద్దరు కల్కి సినిమా రిలీజ్ అయ్యిన నాటి నుంచి తమకి ఉన్న లక్షల ఫాలోవర్స్ అకౌంట్స్ తో సోషల్ మీడియాలో కల్కి సినిమాపై పనిగట్టుకుని నెగిటివ్ వార్తలు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. కాగా కల్కి వసూళ్లు అన్నీ ఫేక్ అని చిత్ర నిర్మాతలు ఫేక్ వసూళ్లు వేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కల్కి సినిమాని ఈ ఇద్దరూ విపరీతంగా టార్గెట్ చేశారు.

దీనితో కావాల్సినంత అటెన్షన్ కూడా తెచ్చుకున్నారు కానీ ఈ అటెన్షన్ తెచ్చుకునే క్రమంలో తమ గొయ్యి వారే తవ్వుకున్న వారు అయ్యారని చెప్పాలి. కాగా ఈ మేటర్ ని సీరియస్ గా తీసుకున్న వైజయంతి మూవీస్ వారు వారిద్దరికీ తమ సినిమాని డీ ఫేమ్ చేస్తున్నందుకు గాను లీగల్ నోటీసులు పంపించారట. దీనితో ఈ ట్విస్ట్ సోషల్ మీడియాలో బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

kalki 2898 ad makers gave big shock to bollywood critics and demanding 25cr

తమ సినిమాని కించపరుస్తూ తప్పుడు వార్తలు ప్రచురించినందుకు గాను తమకి వాళ్ళు 25 కోట్ల పరువు నష్టం దావా కట్టాలని ఊహించని షాకిచ్చారట. దీనితో ఈ ఊహించని ట్విస్ట్ బి టౌన్ లో వైరల్ గా మారింది. కాగా ఈ ఇద్దరి విషయంలో సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీ ఉంది. ఫైనల్ గా ఇలా వారు ఇరుక్కున్నారు. అందరిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు 25 కోట్లు వారు కట్టే పరిస్థితికి వచ్చారు.

ఇక ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిర్మాత అశ్వినీదత్ ఎవరినీ వదిలిపెట్టరు అని ఇలాగే అందరి విషయాల్లో చెయ్యాలి అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో ఉలగనయగన్ కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె అలాగే దిశా పటానిలు నటించగా డుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ లాంటి యువ నటీనటులు కూడా భాగం పంచుకున్నారు. అలాగే ఇండియాస్ సెన్సేషన్ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్యామియో పాత్రలు చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X