kalki 2898 AD: మహాభారతం ఎండింగ్..కలియుగం బిగినింగ్,ఏం లింక్ చేశాయ్యా..నాగీకి ప్రభాస్ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. భారతీయుల ఇతిహాసం మహాభారతంలోని కొన్ని అంశాలను కలియుగానికి లింక్ చేస్తూ.. శ్రీమహావిష్ణువు చివరి అవతారం కల్కి అవతరించే సమయంలో చోటు చేసుకునే పరిణామాలను ఊహిస్తూ నాగ్ అశ్విన్ ఈ విజువల్ వండర్‌ను సెల్యూలాయిడ్‌పై ఆవిష్కరించారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లలో ఈ సినిమా సరికొత్త రికార్డులను లిఖించింది. తొలి రోజే ఏకంగా రూ.250 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కల్కికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డులు బద్ధలవుతాయని ముఖ్యంగా బాహుబలి 2 రికార్డులు గల్లంతవ్వడం ఖాయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

kalki 2898 AD Prabhas fans celebrate the release of the movie and praised nag ashwin

దాదాపు 40 ఏళ్ల తర్వాత దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కలిసి నటించడంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. హీరోయిన్ దీపికా పదుకొణే, దిశాపటానీ లాంటి వారు కూడా వీరికి జత కలవడంతో హిందీనాట వసూళ్ల వర్షం కురుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో పాటు పిల్లలకు నచ్చే అంశాలు సైతం ఇందులో పొందుపరిచారు. ముఖ్యంగా బుజ్జి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది. ఓ సినిమా హిట్టా , ఫట్టా అనేది తేల్చేది ఫ్యామిలీ ఆడియన్సే. కాబట్టి వారిని గనుక థియేటర్లకు రప్పించినట్లయితే కల్కికి తిరుగులేదని అంటున్నారు.

కల్కి 2898 ఏడీ రిలీజ్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్పెషల్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా , ఆష్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి చోట్ల ఎర్లీ మార్నింగే షోలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని డార్లింగ్ అభిమానులు తమ సన్నిహితులతో పంచుకుంటూ ఉండటంతో అవికాస్తా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మహాభారత యుద్ధంతో కల్కి ప్రారంభం అవుతుంది. ఇందులో అశ్వత్థామ రోల్‌ను ప్రత్యేకంగా చూపిస్తారు. ఆ యుగం నుంచి కలియుగంలోని 2898 ఏడీకి కథను తీసుకెళతాడు నాగ్ అశ్విన్. సినిమా ప్రారంభమైన అర్ధగంటకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడట. ఈ సీన్‌కు ప్రేక్షకులు కుర్చీలో కూర్చోవడం కష్టమేనట. అనంతరం విలన్ కమల్ హాసన్ ఎంట్రీ కూడా అదే స్థాయిలో ఉంటుందట. మొదటి 15 నిమిషాలు మాత్రం మిస్ కావొద్దని అభిమానులు కోరుతున్నారు. అమితాబ్, ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయట.

ఇంటర్వెల్ బ్యాంగ్.. సెకండ్ పార్ట్‌ డ్రామాను నాగ్ అశ్విన్ అద్భుతంగా డీల్ చేసినట్లుగా ఫ్యాన్స్ చెబుతున్నారు. దీపికా పదుకొణే , దిశాపటానిలు కూడా యాక్షన్ సీన్స్‌ని అదరగొట్టారని.. ఇక క్లైమాక్స్ అయితే గూస్ బంప్సే అని ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. మొత్తం సినిమాకే క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు మూవీలో ఉన్న చిన్న చిన్న తప్పులను డామినేట్ చేయడంతో ప్రేక్షకుడు ఎక్కడా డిజాప్పాయింట్ కాడు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బాక్సాఫీస్‌పై ప్రభాస్ తుఫాన్ సృష్టించబోతున్నాడని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X