Kalki 2898 AD Pre Review కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ రివ్యూ: ఇండియన్ స్క్రీన్‌పై ప్రభాస్ సరికొత్త చరిత్ర!

ఇండియన్ సినిమా రంగంలో సరికొత్త బాక్సాఫీస్ చరిత్రను సృష్టించేందుకు కల్కి 2898 ఏడీ సినిమా సిద్దమైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించిన విషయం తెలిసిందే. మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్బంగా ఈ సినిమాను భారీగా నిర్మించారు. కల్కి 2898 ఏడీ సినిమాను సుమారుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత, విజువల్ గ్రాఫిక్స్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.

Kalki 2898 AD Pre Review

మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నుంచి కథను ఎంచుకొని కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందించారు. కర్మ సిద్దాంతం ఆధారంగా కథ నడుస్తున్నది. ఈ చిత్రంలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్ అనే పాత్రలో కమల్ హాసన్, భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పదుకోన్, రోక్సీగా దిశా పటానీ నటిస్తున్నారు. ఇక భైరవ దోస్తీగా బుజ్జి అనే స్పెషల్ సూపర్ స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నది.

ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 180 కోట్ల రూపాయలుగా, కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 85 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 385 కోట్లుగా నమోదు అయింది.

Kalki 2898 AD Pre Review

కల్కి చిత్రాన్ని భారీగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో 400 స్క్రీన్లు, ఆంధ్రాలో 850 స్క్రీన్లతో కలిపి మొత్తంగా 1250 స్క్రీన్లలో, హిందీలో 2000 స్క్రీన్లలో, కేరళ, కర్ణాటక, తమిళనాడులో 750 స్క్రీన్లలో కలిపి ఇండియాలో 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో 4500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమాను 8500 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదు అవుతున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అమెరికాలో రిలీజ్‌కు ముందే 3.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా 200 నుంచి 240 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Kalki 2898 AD Pre Review

ఇప్పటి వరకు దర్శకుడు నాగ్ అశ్విన్ కేవలం రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. మూడో చిత్రంగా కల్కి చిత్రాన్ని ఇండియాలోనే లెజెండ్ యాక్టర్లను కలిపి ఈ సినిమా చేయడం విశేషం. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందనే విషయం కోసం ఫిల్మీబీట్ తెలుగును ఫాలో అవుతూ.. రివ్యూ కోసం వేచి చూడండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X