‘ఎన్టీఆర్ మూవీ డిజాస్టర్‌తో పీకల్లోతు కష్టాల్లో.. భారీ నష్టాల నుంచి వాళ్లే గట్టెక్కించారు’
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి అందరి బిగ్ స్టార్ హీరోస్ కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలతో పాటుగా అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో వాటిని మించి అదః పాతాళానికి పడిపోయే స్థాయి డిజాస్టర్ లు కూడా ఉంటాయి. కాగా ఈ సినిమాలు మూలాన హీరోల కెరీర్ కి బాగా దెబ్బ పడుతుంది అని వాస్తవమే కానీ ఆ చిత్రాలు మూలాన నిర్మాతలు ఎంతలా చితికిపోతారో అనేది మరింత ముఖ్యం.
ఏ సినిమా అయినా కూడా నిర్మాత లేకపోతే ఆ సినిమా లేదు. మరి పైన చెప్పుకున్న డిజాస్టర్ సినిమాల్లో తెలుగు సినిమా దగ్గర కనిపించే ఘోర పరాభవ చిత్రం "శక్తి" కూడా ఉంటుంది. 2011 లో వచ్చిన ఈ చిత్రం అప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ 40 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాత అశ్వినీదత్ తెరకెక్కించారు. కాగా ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు.

అయితే ఓ దర్శకుడు, నిర్మాతల కెరీర్ లు ఒక సినిమాకి ముందు ఆ తర్వాత అని చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణ అని చెప్పి తీరాలి. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో డిస్ట్రిబ్యూటర్లు ఊహించని నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇక నిర్మాతగా ఉన్నదంతా అప్పటికి ఈ సినిమా మీదనే అశ్విని దత్ పెట్టేసారు. సినిమా ఫలితం ఏమో దారుణంగా వచ్చింది.
దీనితో ఇదే నా కెరీర్లో అతి పెద్ద షాక్ అని అశ్విని దత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ సినిమా తర్వాత ఇక సినిమాలు ఆపేద్దాం అని ఫిక్స్ అయిపోయాను అని అప్పుడు నా కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ లు ఓ సినిమా తీసుకొచ్చారు. అదే "సీతారామం" అని తెలిపారు. డాడీ మీరు హ్యాండిల్ చేయాలి అని ఈ సినిమాని తీసుకురావడం ఆ సినిమా ఒక వండర్ అని తెలిపారు.

హను అద్భుతంగా తెరకెక్కిస్తే మళ్లీ ఆ సినిమాతో ఫామ్ లోకి వచ్చానని తెలిపారు. ఈ రకంగా అయితే ఎప్పుడో 2011 లో శక్తి ఇచ్చిన షాక్ తో మళ్ళీ కోలుకొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా తాను చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. అది కూడా తన కూతుర్ల వల్ల మళ్ళీ ఫామ్ లోకి రావడం ఇప్పుడు ఇదే నిర్మాత నుంచి ఇండియన్ సినిమా గర్వించదగ్గ "కల్కి 2898 ఎడి" అనే సినిమా రావడం జరిగింది.
రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఇపుడు ఎలాంటి వసూళ్లు వరల్డ్ వైడ్ గా అందుకుంటుందో చూస్తూనే ఉన్నాం. కాగా ఈ చిత్రాన్ని అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ భర్త నాగ్ అశ్విన్ నే దర్శకత్వం వహించడం విశేషం. మరి ఈ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా నటించగా దీనికి ఇప్పుడు కొనసాగింపు సినిమా కూడా రాబోతుంది. ఇది ఈ ఏడాదిలో చివరిలో అలా షూటింగ్ మొదలు పెట్టుకోనుంది.


Click it and Unblock the Notifications











