1000 కోట్లకు కల్కి చేరువైన సమయంలో.. ప్రభాస్ చెల్లెళ్ళపై నిర్మాత షాకింగ్ పోస్ట్

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాని షేక్ చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898 ఎడి తన హవా కొనసాగిస్తూ 1000 కోట్ల మార్క్ ని అందుకుంటుంది. కాగా ఈ తరహా సినిమాలు తెరకెక్కించాలి అంటే ఎన్నో యూనిట్లు అసలు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ భారీ సినిమా సినిమా వెనుక చాలా మంది కఠోర శ్రమ దాగి ఉంది.

దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ సీనియర్ నటుడు అమితాబ్ నుంచి ప్రతి చిన్న టెక్నీషియన్ కూడా ఈ సినిమాకి ఎంతగానో కష్టపడ్డారు. అయితే తెరపై కనిపించే వారితో పాటుగా తెర వెనుక కనపడకుండా చాలా మందే ఈ భారీ సినిమాని ఒక విజువల్ ఫీస్ట్ గా అందించేందుకు శ్రమించగా ఈ సినిమా విషయంలో మరిన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి.

kalki 2898 ad producer comments on prabhas sisters

కాగా ఈ సినిమాకి ఒక్క ప్రభాస్ మాత్రమే కాకుండా ప్రభాస్ పెదనాన్న స్వర్గీయ కృష్ణం రాజు గారి కూతుళ్లు కూడా తమదైన తమదైన చేయూతని అందించడం ఇపుడు బయటకి వచ్చింది. ప్రభాస్ తో తన చెల్లెళ్ళు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఇద్దరు అంటే ఎంతో ఇష్టం అలాగే ప్రభాస్ అంటే కూడా వారికీ ఎంతో ప్రేమ, అభిమానం. కాగా ఈ ఇద్దరు కల్కి కోసం చాలా అనే చాలా కష్టపడ్డారు అని ఆ సినిమా నిర్మాత ప్రియాంక దత్ వారిద్దరినీ ప్రశంసించారు.

కేవలం ఈ ఇద్దరిపై ఆమె ఏ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు అంటే కొన్ని పర్వతాలని కదిలించడానికి మీకు పెద్ద పెద్ద ఆర్మీలు అవసరం లేదు. కేవలం ఈ ఇద్దరూ ఉంటే చాలు.. నా బలం నా ఆర్మీ వీరిద్దరే.. కల్కి విషయంలో అసలు అసాధ్యం కావు అనుకున్న ఎన్నో విషయాలు కేవలం వీరి వల్ల మాత్రమే సాధ్యం అయ్యాయి. చుట్టూ వాళ్లే నిరతంతం పరిగెడుతు పని చేయడం వల్లే నేను ప్రశాంతంగా నిద్ర పోగలిగాను ప్రియాంక దత్ ప్రభాస్ చెల్లెళ్లను ఆకాశానికి ఎత్తేసారు.

kalki 2898 ad producer comments on prabhas sisters

దీని బట్టి అసలు వారిద్దరూ తన అన్నయ్య సినిమా కోసం ఎంతలా శ్రమించారో మనం అర్ధం చేసుకొని తీరాలి. కాగా ఈ భారీ చిత్రంలో ఉలగనయగన్ కమల్ హాసన్ సహా దీపికా పదుకొనె, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన ఇంకా విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ సహా మరెందరో ప్రముఖ నటులు అత్యంత ముఖ్య పాత్రల్లో నటించగా వైజయంతి మూవీ వాళ్లు సుమారు 700 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

తదుపరి కల్కి యూనివర్స్ లో భాగంగా మరిన్ని సినిమాలు అయితే మన టాలీవుడ్ సినిమా నుంచి రానున్నాయి. వీటి కోసం ప్రభాస్ అభిమానులు పాన్ ఇండియా ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X