సీతారామం మూవీకి మొండిచేయ్యి.. నేషనల్ అవార్డులపై కల్కి నిర్మాత తీవ్ర అసంతృప్తి!

ఏ నటీనటులు అయినా దర్శక నిర్మాతలు అయినా కూడా తాము చేసిన పాత్రలకి లేదా సినిమాలకి మంచి గుర్తింపు రావాలని కోరుకోవడం అనేది సహజంగానే ఉంటుంది. అయితే మంచి కంటెంట్ ఇచ్చినప్పటికీ కూడా వాటికీ సరైన గుర్తింపు రాకపోతే ఖచ్చితంగా ఏ నటి అయినా నటుడు అయినా డిజప్పాయింట్ అవుతారు. అయితే సినిమా రంగంలో అవార్డ్స్ అనేవి కూడా ఒక భాగం.

దేశ వ్యాప్తంగా ఆ అవార్డ్స్ ఈ అవార్డ్స్ అని చాలానే ఉంటాయి కానీ జాతీయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవార్డ్స్ కొన్ని ఉంటాయి. కాగా ఈ లిస్ట్ లో నేషనల్ అవార్డు మాత్రం ప్రతి ఒకరు కోరుకుంటారు. అయితే గత ఏడాదిలో పలు చిత్రాలకి నటులకి గాను నేషనల్ అవార్డులు తెలుగు సినిమాలో వచ్చాయి.

kalki 2898 ad producer emotionall for not getting national awards for Mrunala Thakurs s sita ramam

కానీ కోవిడ్ కారణాలు మూలాన దశల వారీగా ఇప్పుడు అవార్డులు ఇస్తుండగా తాజాగా 2022 ద్వితీయార్ధంలో వచ్చిన పలు చిత్రాలు కొన్ని అప్పుడే సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలకి నేషనల్ అవార్డ్స్ అందించారు. కానీ ఈ లిస్ట్ లో కొన్ని సినిమాలకి ఎలాంటి అవార్డు ఏ విభాగంలో కూడా రాకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

కాగా ఈ లిస్ట్ లో తెలుగులో అద్భుతమైన విజయాన్ని సాధించిన చిత్రం "సీతా రామం" కూడా ఒకటి. యువ నటులు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు తెలుగులో డెబ్యూ ఇస్తూ చేసిన ఈ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కించారు. కాగా 2022 లో వచ్చిన ఈ సినిమాకి మంచి వసూళ్లతో పాటుగా అద్భుతమైన ఆదరణ కూడా వచ్చింది. దీనితో ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా అని చాలా మంది అనుకున్నారు.

కానీ సీన్ కట్ చేస్తే ఈ ప్రేమ కథా చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాలేదు. మరి దీనితో సినిమా నిర్మాత స్వప్న దత్ అయితే బాగా హర్ట్ అయ్యారని చెప్పాలి. ఈమెకి సీతారామం చిత్రానికి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాకపోవడంపై చాలా మంది కాల్స్ మెసేజెస్ కూడా చేసి అడిగి విచారం వ్యక్తం చేశారని తెలిపారు. అయితే తమ సినిమాకి ఎలాంటి అవార్డు రాకపోవడం చాలా బాధ కలిగించింది అని ఆమె తెలిపారు.

kalki 2898 ad producer emotionall for not getting national awards for Mrunala Thakurs s sita ramam

ఐతే దీనితో ఇక్కడేమి ఆగిపోమని తమ నుంచి మరిన్ని గొప్ప చిత్రాలు తప్పకుండా వస్తాయని మంచి స్పిరిట్ తో తెలిపారు. ఆల్రెడీ వీరి నుంచి ఈ ఏడాదిలో సెన్సేషనల్ హిట్ చిత్రం "కల్కి 2898 ఎడి" వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఏకంగా 1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై చేసిన ఈ సినిమాని నిర్మాత అశ్వినీదత్ తన కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ ల మూలానే అప్పుడు సీతారామం అయినా ఇప్పుడు కల్కి అయినా అయ్యింది అని అశ్వినీదత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మొత్తానికి తండ్రికి తగ్గ కూతుళ్లుగా వారు ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X