Kalki 2898 AD Trailer Review: ఒక్క ఓటమి లేదు.. ప్రిపేర్ వచ్చాను.. ప్రభాస్ కల్కి ట్రైలర్ కేక!
తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ నిర్మించిన చిత్రం కల్కి 2898 AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్వీన్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్, దీపిక పదుకోన్, దిశా పటానీ జంటగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో యూనిట్ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
అశ్వత్తామ పాత్రలో అమితాబ్ బచ్చన్.. దీపిక పదుకోన్‌తో మాట్లాడుతూ.. సమయంలో వచ్చింది. భగవంతుడి రూపంలో సమస్త సృష్టి ఉంటుందంటారు. నీ గర్బంలోనే భగవంతుడు ఉన్నాడు అనే ఎమోషనల్ డైలాగ్స్‌తో ట్రైలర్‌లోకి తీసుకెళ్లిన తీరు బాగుంది. ట్రైలర్‌ను యాక్షన్ కట్‌తో వదిలిన విధానం సినిమాపై భారీగా అంచనాలు పెంచేలా చేశాయి.

ఇక ఇదంతా రేపటి కోసం అని దీపిక పదుకోన్ అంటే.. ఈ రోజు చంపితే రేపు ఎలా ఉంటుందని విలన్ చెప్పిన తీరు.. కల్కి పుట్టుక గురించేదనేది చెప్పకనే చెప్పారు. ఇక ప్రభాస్ జల్సా రాయుడిగా కనిపించి.. తనదైన యాక్షన్ కట్‌తో అభిమానుల్లో ఆశలు రేపాడు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య యాక్షన్ సీన్లు భారీగా కనిపించాయి.
ఇక ఎన్ని యుగాలు మారినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా.. మనిషి మారడు. మారలేడు అంటూ కమల్ హసన్ ఎంట్రీ బాగుంది. పురాణాల ఆధారంగా మూడు కాలల గురించి చెప్పే కథతో నాగ్ అశ్విన్ వస్తున్నాడు.
ట్రైలర్‌లో విజువల్స్ ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా ఉందనే విషయం వాస్తవంగానే కనిపిస్తున్నది. ఇక ప్రభాస్ చెప్పినట్టు.. ఓడిపోయే సమస్యే లేదు. ప్రిపేర్ అయి వచ్చాను అంటూ ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











