Breaking: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. కల్కి అఫిషియల్ రిలీజ్ డేట్ ఇదే!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం కల్కి 2828 ఏడీ. ఈ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, దీపిక పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ కన్ఫార్మ్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాల్లోకి వెళితే..

ప్రాజెక్టు K అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన ఈ చిత్రం చివరకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేసుకొన్నది. ఈ సినిమాను సుమారుగా 600 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం తొలిసారి ప్రపంచ సినిమారంగంలో ఎవరూ ఊపయోగించని టెక్నాలజీని, వీఎఫ్ఎక్స్‌ను వాడుతుండంటం విశేషంగా చెప్పుకోవచ్చు.

Prabhas s Kalki 2898 AD

అయితే ఈ సినిమాను వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. అయితే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అడ్డుగా నిలిచాయి. దాంతో ఈ మూవీని జూన్ 27వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు.

ఇక ఈ సినిమా ప్రీమియర్స్ మాత్రం అమెరికాలో ఒక రోజు ముందే ప్రదర్శింపబడుతాయి. అంటే జూన్ 26వ తేదీన బుధవారం అమెరికాలో ప్రీమియర్లను స్క్రినింగ్ చేస్తారు. ఇక రిలీజ్ డేట్‌ను అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, కల్కి సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతున్నది. ఈ సినిమాకు ఇప్పటికే భారీగా ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ జరిగింది. ఇంకా సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X