కల్కి 2898 AD స్టోరీ అవుట్.. జక్కన్న ఫార్మాట్‌ను నాగ్ అశ్విన్ ఫాలో అయ్యాడా?
ఇప్పుడు నో డౌట్ గా ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న తదుపరి బిగ్గెస్ట్ సినిమాల్లో భారీ వ్యయంతో తెరకెక్కించిన చిత్రం 'కల్కి 2898 AD' అనే చెప్పాలి. ఇది ఒక మహా సమాహారం. ఇండియన్ సినిమా దగ్గర అగ్ర తారలు కలయికలో యువ తెలు దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన మహా ప్రయత్నమే ఇది.
మరి బాహుబలి తో ఇలాంటి బరువైన పాత్రలు ప్రభాస్ ని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన పాత్రల్లో ఒక్కటే ఈ కల్కి కూడా.. అయితే ఈ సినిమా ఇండియా లోనే ఒక ఖరీదైన సినిమాగా మొదలైంది. చాలానే సమయం తీసుకున్నారు కానీ ఇండియా లెవెల్లో స్టాండర్డ్స్ ని సెట్ చేసే సినిమాగా దీనిని రూపొందించారు.

ఇది సరే బాగానే ఉంది కానీ అసలు సినిమాలో కథాంశం ఏంటి? నాగి ఏం ప్లాన్ చేస్తున్నాడు అని ఎప్పుడు నుంచో రూమర్స్ ఉన్నాయి. ఇక మొన్న వచ్చిన ట్రైలర్ తో దీనిపై మరికొంత క్లారిటీ బయటకి వచ్చింది. కాగా అసలు తాము తీసిన కల్కి కథ ఇది అని నాగి ఇప్పుడు పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చాడు.
ఇది అన్నిటికీ ఒక క్లైమాక్స్ సినిమా అని కలియుగం అంతం.. దీనిపై మొత్తం ఐదేళ్లు కూర్చొని కథ రాసానని చెప్పాడు. మహాభారతం నుంచి మన దేశంలో భవిష్యత్తుపై ప్రపంచ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక గ్లోబల్ కాన్సెప్ట్ అంటూ విడుదలకి ముందే మొత్తం చెప్పేసాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉలగనయగన్ కమల్ హాసన్ చేస్తున్న పాత్ర 'కలి' కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

ప్రతి విష్ణు అవతారంలో కలి ఒకో రాక్షసుడిగా జన్మించేవాడు అని కొంత సమాచారం కూడా అందించడంతో అసలు తాము ఎలాంటి సినిమా చూడబోతున్నాం దాని తాలూకా కథ ఏంటి అనేది చాలా వరకు క్లారిటీ ఆడియెన్స్ లో వచ్చేసింది. కాగా నాగి అయితే ఇలా రిలీజ్ కి ముందే కథ చెప్పడం జక్కన్న రాజమౌళి ఫార్మాట్ ని గుర్తు చేయక మానదు.
జక్కన్న కూడా సినిమాకి ముందే అసలు ఏం తీస్తున్నాం తీయబోతున్నాం అనేది ముందే చెప్పిన సందర్భాలు చూసాం. కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా నాగి కూడా ఇదే ఫార్మాట్ ని తీసుకున్నాడని చెప్పవచ్చు. మరి ముందే కథ చెప్పి జక్కన్న తరహా లోనే నాగ్ అశ్విన్ కూడా సెన్సేషనల్ సక్సెస్ ని కొడతాడో లేదో జస్ట్ ఇంకొన్ని రోజులు ఆగి చూస్తే తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











