కల్కి టికెట్ రేట్లు పెంపు.. నైజాంలో ఎంత? ఏపీలో ఎంత? 2డీ, 3డీ వెర్షన్ టికెట్ రేట్ ఎంతంటే?
తెలుగు సినిమా ప్రతిష్టను పెంచనున్న కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27వ తేదీన బ్రహ్మండంగా రిలీజ్ కానున్నది. అయితే అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుకొనే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దాంతో గత కొద్ది ఏళ్లుగా ఏపీ ప్రభుత్వంతో సాగుతున్న వివాదానానికి తెరపడింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
ఏపీలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం తెలుగు సినిమా రంగంపై వరాలు కురిపించింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెంచిన టికెట్ రేట్లు జూన్ 27వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సుమారుగా 14 రోజులపాటు అమల్లో ఉంటాయి.

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన సమయంలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకొనేందుకు, అదనపు షోలకు అనుమతి కోరుతూ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకొన్నది. దాంతో సానుకూలంగా స్పందిస్తూ సింగిల్ థియేటర్‌లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 125 రేటు పెంచుతూ అనుమతి ఇచ్చింది.
నైజాంలో టికెట్ రేట్ల విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్‌లో 2D వెర్షన్ టికెట్ ధర 395 రూపాయలు కాగా, అదనపు ఛార్జీలతో కలిపి ఈ టికెట్ ధర 435 రూపాయలుగా నిర్ణయించారు. ఇక సింగిల్ థియేటర్‌లో టికెట్ ధర 250 రూపాయలు కాగా, ట్యాక్స్‌లతో కలిపి మొత్తం 283 రూపాయలుగా నిర్ణయించారు. ఈ రేట్లు దాదాపు 14 రోజులపాటు అమలులో ఉంటాయి.

ఇక కల్కి 3డీ వెర్షన్ విషయానికి వస్తే.. మల్టీప్లెక్స్‌లో ఈ టికెట్ ధర 445 రూపాయలు కాగా, అదనపు పన్నులతో కలిపి 487రూపాయలుగా నిర్ణయించారు. ఇక సింగిల్ థియేటర్‌లో టికెట్ ధర 245 రూపాయలు కాగా, పన్నులతో కలిపి మొత్తంగా 274 రూపాయలుగా నిర్ణయించారు.
ఇక ఏపీలో కూడా టికెట్ రేట్లు ఇదే నిష్పత్తిలో పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2డీ, 3డీ వెర్షన్స్‌కు కూడా ప్రభుత్వం అనుమతించిన మేరకు టికెట్ రేట్లు వర్తిస్తాయని డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వెల్లడించారు. టికెట్ రేట్ల పెంపుతో ట్రేడ్ వర్గాలు సంతోషంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











