Kalki 2898 AD Twitter Review 30 ని. మహభారతం ఎపిసోడ్ ఓ రేంజ్‌లో.. ప్రభాస్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అత్యున్నత సాంకేతికత, బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ సుమారు నాలుగేళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొచ్చారు.

అమితాబ్, కమల్, దీపిక పదుకోన్, దిశా పటానీ లాంటి యాక్టర్లు తమ కెరీర్‌లో కొత్త అనుభూతిని పొందే సినిమాలో నటించారు.ఇలాంటి సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందించారనే విషయంలోకి వెళితే..

Kalki 2898 AD Twitter Review

కల్కి 2898 ఏడీ సినిమాలో విజువల్స్, సెట ఆప్ చూస్తే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో చూడని విధంగా ఉంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్‌తో నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అయితే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్‌గా ఉంది. ఫస్టాఫ్‌లో ప్రభాస్ రోల్ చాలా తక్కువగా ఉంది. కానీ మంచి ఫన్‌తో ఉంది. ఫస్టాఫ్‌లో క్యారెక్టర్ల పరిచయంతో సెట్ చేశారు అని వెంకీ రివ్యూస్ అన్నారు.

మూవీ మొత్తం ఒకటి.. చివరి 30 నిమిషాలు.. క్లైమాక్స్ మరో లెవల్. ప్రభాస్ మాస్ షో అద్బుతంగా ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది అని ట్వీట్స్ వేస్తున్నారు.

కల్కి సినిమా చూడటం పూర్తి అయ్యింది. బిగ్‌ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా ఇది. ఇండియన్ సినిమా తెరపై ఇప్పటి వరకు ఇలాంటి సీన్లు చూసి ఉండరు. ఈ మూవీలో చాలా స్పెషల్ క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రభాస్ ఫన్నీ వింటేజ్ క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత చూశాం. ఫస్టాఫ్ ఫ్లాట్‌గా ఉంది. సెకండాఫ్‌లో బిల్డప్ ఓ రేంజ్‌లో ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కల్కి సినిమా క్లైమాక్స్ చూస్తే షేక్ అవ్వాల్సిందే. సీట్లో కూర్చోని వణికి పోయాను. అలా ఏడుస్తూ ఉండిపోయాను. నా గొంతు పూడ్చుకుపోయింది. సినిమా అంటే ఇది. ప్రభాస్ అంటే ఏమిటో చూపించిన సినిమా ఇది.. ఇండియా దద్దరిల్లిపోయే హిట్ ఇది అని ఓ నెటిజన్ ఎమోషనల్‌గా చెప్పారు.

కల్కి 2898 ఏడీ సినిమా చూస్తే.. అదిరిపోయింది. సెకండాఫ్ ఒక్క నిమిషం కూడా కదలకుండా చూస్తారు. నాగ్ అశ్విన్ ఈ సినిమా చూస్తే.. నీవే దర్శక శిఖరం అనిపిస్తున్నది. నీవు ఇండియన్ సినిమాను కొన్నేళ్లు పాలిస్తావు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కల్కి 2898 ఏడీ నిజమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియె్స్. కథ, కథనాలతో నడిచే సినిమా. నాగ్ అశ్విన్ సన్నివేశాలను సృజనాత్మకంగా మలిచిన తీరు అద్బుతంగా ఉంది. కొన్ని సీన్లు చూడటానికి కూడా కళ్లు సరిపోవు అనే విధంగా ఉంటాయి. అమితాబ్ బచ్చన్ రోల్ అద్బుతంగా ఉంది. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. డైలాగ్స్ అంతా బాగా లేవు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

కల్కి 2898 ఏడీ సినిమా వెనుక ఇంత శ్రమ ఉన్నది. అందుకే ఈ సినిమాను గౌరవించండి. మా సాంకేతిక నిపుణుల ప్రతిభను రెస్పెక్ట్ చేయండి. ఈ సందర్భంగా మీకు ఒకటే రిక్వెస్ట్. ఈ సినిమాకు సంబంధించిన ట్విస్టులు లీక్ చేయకండి.. నిమిష నిమిషానికి సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇవ్వకండి. అలాగే వీడియోలు తీసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని దూరం చేయకండి అని వైజయంతీ మూవీస్ యూనిట్ వేడుకొన్నారు.

కల్కి సినిమా ఆడితే తెలుగు సినిమా రేంజ్‌ను పెంచే మూవీ అవుతుంది. అలాంటి సినిమా వచ్చే ముందు ఎందుకురా సోషల్ మీడియాలో వార్స్, గొడవలు, వైబ్ అవుదాం రండి అంటూ ఓ నెటిజన్ ఇతర హీరోల ఫ్యాన్స్‌కు సందేశం ఇచ్చారు.

కల్కి కోత మొదలైంది. డార్లింగ్ ప్రభాస్‌కు ఆయన అభిమానులకు బెస్ట్ విషెస్. స్పెషల్ మార్నింగ్ షోస్ ఎప్పుడు మొదలవుతాయా? అని ఎదురు చూస్తున్నాం. బాక్సాఫీస్‌ను షేక్ చేయండి రెబల్ స్టార్స్ ఫ్యాన్స్ అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విషెస్ అందించారు.

కల్కి సినిమా ఆరంభంలో 30 నిమిషాలు మహాభారతం సీక్వెన్స్ ఉంటుంది. ప్రతీ సీన్, ఒక్కో సీన్‌లో దివ్యత్వమే కాకుండా మ్యాజికల్ మూమెంట్స్ హైలో ఉంటాయి అని ఓ నెటిజన్ కథలోని సన్నివేశాలను లీక్ చేశాడు.

కల్కి సినిమా రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్‌‌‌లో అభిమానులు మధ్య పండగ వాతావరణం కనిపించింది. సంధ్య థియేటర్ వద్ద అభిమానులు లైటింగ్, కటౌట్స్ పెట్టి.. ప్రభాస్‌కు పూజలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X