ఆ డైరెక్టర్‌కు అలాంటి కంపెనీ.. అంతా బిజినెస్ లెక్కలే.. జీవిత

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ ''ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి వచ్చిన ప్రవీణ్‌ సత్తారుగారికి థ్యాంక్స్‌. 'గరుడవేగ'తో రాజశేఖర్‌గారి ఇమేజ్‌ని తీసుకువెళ్లి ప్రవీణ్‌ సత్తారుగారు ఎక్కడో పెట్టారు. ఆ సినిమా తర్వాత చాలా కథలు విన్నాం. 'గరుడవేగ' హిట్‌ కావడంతో చాలామంది నిర్మాతలు సినిమా చేయడానికి వచ్చారు. కానీ, ఎవరొచ్చినా బిజినెస్‌ లెక్కలు వేసుకొచ్చి కథలు చెప్పారు. కొత్త నిర్మాతలు వచ్చి కథ మా ఇష్టమని అన్నా... వాళ్లు ఎలా తీస్తారో తెలియదనే టెన్షన్‌. రకరకాల టెన్షన్స్‌ మధ్య 'కల్కి' కథ విన్నాం. దీని ఒరిజినల్‌ రైటర్‌ సాయి తేజ. తను కథ వినిపించాడు.

ప్రశాంత్‌ వర్మకు స్క్రిప్ట్ విల్‌ అని కంపెనీ ఉంది. అందులో పది, పన్నెండు మంది రైటర్స్‌ ఉన్నారు. వాళ్ల దగ్గర ఎన్ని కథలున్నాయో. ప్రశాంత్‌కి ఖాళీ దొరికితే తడుముకోకుండా పది కథలు చెబుతాడు. అలా విన్న కథ ఇదే. మా అందరికీ బాగా నచ్చింది. ప్రశాంత్‌ డైరెక్ట్‌ చేస్తే బావుంటుదనుకున్నాం. తను మాత్రం డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే చేసి వేరొకరితో డైరెక్ట్‌ చేయిస్తానని అన్నాడు. ఫుల్‌ స్క్రిప్ట్, స్క్రీన్ రెడీ అయ్యాక... 'ప్రశాంత్‌ నువ్వే డైరెక్ట్‌ చేస్తే బావుంటుంది' అని అడిగితే 'సరే' అన్నాడు.

Kalki movie is getting ready for release on June 28th

నేనే నిర్మాతగా స్టార్ట్‌ చేశాం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. ఈ బాధ్యతను ఎవరితో షేర్‌ చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు సి. కల్యాణ్‌ అన్నయ్యను కలిశా. ఆయన 'ఏం చేస్తున్నావమ్మా' అని అడిగారు. 'మనం పార్టనర్స్‌గా చేద్దాం' అని కల్యాణ్‌ అన్నయ్య జాయిన్‌ అయ్యారు. అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పూర్తి చేశాం. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన టీజర్స్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అన్నారు.

నటీనటులు: అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

సాంకేతిక వర్గం:
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్,
ఆర్ట్: నాగేంద్ర,
ఎడిటర్: గౌతమ్ నెరుసు,
స్టిల్స్: మూర్తి,
లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె),
కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్,
ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు,
ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు,
చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి,
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి,
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి,
సమర్పణ: శివాని, శివాత్మిక,
నిర్మాత: సి.కళ్యాణ్,
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X