‘కల్కి’ టీజర్: హీరో రాజశేఖర్లో సత్తా ఏ మాత్రం తగ్గలేదు..
డా.రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం కల్కి. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌లో రూపొందుతున్న మూవీ టీజర్ రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం విడుదల చేశారు.
1983 నాటి కథతో 'కల్కి' చిత్రం సాగుతుందని తెలుస్తోంది. అయితే టీజర్లో సినిమాకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. హీరో రాజశేఖర్ తన యాంగ్రీ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
రోటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ 'కల్కి' చిత్రాన్ని ప్రేక్షకుల ఊహకు అందని విధంగా రూపొందిస్తున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. 'గరుడ వేగ' సినిమా తర్వాత మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చి తన స్టార్ స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న రాజశేఖర్... 'కల్కి'తో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచారు.
రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, రాహుల్, రామకృష్ణ, నాజర్, ఆషుతోష్ రానా, సిద్దు జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణు గోపాల్, వెన్నెల రామారావు, డిఎస్ రావు, అమిత్ శర్మ, సతీష్ ముఖ్య పాత్రలు పోషించారు.

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే
ఆర్ట్: నాగేంద్ర
ఎడిటర్: గౌతమ్ నెరుసు
ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్-సుబ్బు
నిర్మాత: సి కల్యాణ్
దర్శకత్వం ప్రశాంత్ వర్మ


Click it and Unblock the Notifications











