‘కల్కి’ టీజర్ కేక: హీరో రాజశేఖర్ విశ్వరూపం చూపించబోతున్నారా?

Recommended Video

Kalki Movie Second Official Teaser Released || Filmibeat Telugu

రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం 'క‌ల్కి'. శివానీ శివాత్మిక స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌ాపీ మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందుతున్న మూవీకి సంబంధించి మరో టీజర్ విడుదల చేశారు. 1.20 నిమిషాల నిడివిగల ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచేసింది.

ఇందులో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో హింట్ ఇచ్చే విధంగా ఈ టీజర్ డిజైన్ చేశారు. ఇందులో ఎక్కువగా సస్పెన్స్ క్రియేట్ చేసే సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డైలాగులు ఏమీ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ వాయిస్‌తో టీజర్ రిలీజ్ చేశారు.

రాజశేఖర్ విశ్వరూపం చూపించబోతున్నారా?

రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించబోతుండటంతో మరోసారి ఆయన తన వివ్వరూపం చూపించబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. ‘గరుడవేగ' మూవీలో కూడా అతడు ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

1983 నాటి కథతో

1983 నాటి కథతో

1983 నాటి కథతో 'కల్కి' చిత్రం సాగుతుందని తెలుస్తోంది. అయితే టీజర్లో సినిమాకు సంబంధించి ఎలాంటి క్లూ ఇవ్వలేదు. హీరో రాజశేఖర్ తన యాంగ్రీ పెర్ఫార్మెన్స్‌, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రేక్షకుల ఊహకు అందని విధంగా

ప్రేక్షకుల ఊహకు అందని విధంగా

రోటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ 'కల్కి' చిత్రాన్ని ప్రేక్షకుల ఊహకు అందని విధంగా రూపొందిస్తున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. 'గరుడ వేగ' సినిమా తర్వాత మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చి తన స్టార్ స్టామినా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న రాజశేఖర్... 'కల్కి'తో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచారు.

కల్కి

కల్కి

రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్, రాహుల్, రామకృష్ణ, నాజర్, ఆషుతోష్ రానా, సిద్దు జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణు గోపాల్, వెన్నెల రామారావు, డిఎస్ రావు, అమిత్ శర్మ, సతీష్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్-సుబ్బు నిర్మాత: సి కళ్యాణ్ దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X