twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్కంఠ కలిగించే స్క్రీన్ ప్లేతో వస్తున్న రాజశేఖర్ 'కల్కి'.. రిలీజ్ డేట్ ఖరారు!

    |

    యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న 'కల్కి' చిత్రం రిలీజ్ డేట్ ఖారారైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ "పక్కా కమర్షియల్ చిత్రమిది. కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తాం. శ్రవణ్ భరద్వాజ్ అద్భుతమైన బాణీలను అందించారని తెలిపారు.

     Kalki set for a massive release on June 28th worldwide

    రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన 'హార్న్ ఓకే' పాటను జూన్ 12న రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు. లలిత కావ్య పాడిన ఈ పాటను కేకే రాశారు. 'మధుర' మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి.

    దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ "ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు 'కల్కి' అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని తెలిపారు.

    అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

    ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

    English summary
    Rajasekhar new movie Kalki, directed by Prashanth Varma, all set to release the film on the 28th of this month. Presented by Shivani & Shivatmika, Kalki is being produced on Happy Movies banner by C Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X