2 సార్లు సూసైడ్ అటెంప్ట్.. పిచ్చాసుపత్రికి పంపండి.. కల్పిక గణేష్ తండ్రి ఫిర్యాదు

గత కొంతకాలంగా సినీ నటి కల్పిక గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ పబ్‌‌లో సిబ్బందిపై దాడి చేయడం, అసభ్యపదజాలంతో దూషించడం వంటి ఘటనలతో కేసుల దాకా తెచ్చుకుంది కల్పిక గణేష్. ఈ గొడవ సద్దుమణగకముందే రెండ్రోజుల క్రితం ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌తో దురుసుగా ప్రవర్తించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో కల్పిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..

పబ్‌లో కల్పిక గొడవ
గత నెలలో తన పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి ఏరియాలోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లిన కల్పిక గణేష్ .. అర్ధరాత్రి వరకు అక్కడే గడిపింది. బిల్ కట్టిన తర్వాత డిజర్ట్‌గా చీజ్ కేక్‌ను కాంప్లిమెంట్‌గా ఇవ్వాలని పబ్ సిబ్బందితో గొడవకు దిగింది కల్పిక. ఈ గొడవ తీవ్రంగా కావడంతో పబ్ మేనేజర్ ఆమెకు సర్దిచెప్పాలని ప్రయత్నించినా కల్పిక వినిపించుకోలేదు. ప్లేట్లు విసిరేసి, బూతులు తిడుతూ గొడవను మరింత పెంచింది కల్పిక. దీనిపై పబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సినీనటిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు.

Kalpika Ganesh Father Files police complaint on his daughter s mental health issues

ఆన్‌లైన్‌లో వేధింపులపై కేసు
పబ్ వ్యవహారం సద్దుమణగకముందే కల్పిక గణేష్‌పై మరో కేసు నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనపై అసభ్యపదజాలంతో దూషించిందని కీర్తన అనే యువతి సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కల్పిక గణేష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పబ్, కీర్తన కేసుల్లో తనను అరెస్ట్ చేయొద్దంటూ కల్పిక గణేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కల్పికను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది.

రిసార్ట్‌లో సిగరెట్ల కోసం గొడవ
రెండ్రోజుల క్రితం హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో దురుసుగా ప్రవర్తించింది. క్యాబ్ దిగి నేరుగా రిసెప్షనిస్ట్ వద్దకు వెళ్లిన కల్పిక.. తాళాలు, మెనూ కార్డ్ విసిరికొట్టి బూతులు తిట్టింది. దీనితో రిసార్ట్ నిర్వాహకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కల్పిక స్పందించింది. తాను సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని.. క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై కూడా అందుబాటులో లేదని ఆరోపించింది.

Take a Poll

నా కూతురికి మెంటల్
అయితే కల్పిక గణేష్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సంఘవార్ సీన్‌లోకి వచ్చారు. తన కుమార్తె గత కొంతకాలంగా మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోందని.. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని, గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించామని తెలిపారు. అయితే అక్కడ ఉండకుండా కల్పిక ఇంటికి వచ్చేసిందని.. డాక్టర్లు సూచించిన మందుల్ని కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందని, కుటుంబంలోనూ అందరితో గొడవ పడుతోందని సంఘవార్ అన్నారు. డిప్రెషన్‌లో ఉండటం వల్లే తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందని కల్పికను మళ్లీ రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించాలని ఆయన పోలీసులను అభ్యర్ధించారు. దీంతో కల్పిక వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది.

More from Filmibeat

Read more about: kalpika ganesh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X