భార్యపై ప్రేమను కురిపించిన చిరు చిన్నల్లుడు.. వైరల్ పోస్ట్
చిరంజీవి చిన్న కూతురు శ్రీజను కళ్యాణ్ దేవ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీజ మొదటి వివాహం బెడిసికొట్టిన తరువాత.. కళ్యాణ్ దేవ్‌తో వివాహం జరిగింది. చిరు చిన్నల్లుడుగా ఇండస్ట్రీలో మంచి పేరే సంపాదించుకున్నాడు. విజేత సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో పర్వాలేదనిపించిన కళ్యాణ్.. రెండో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టేశాడు.
సినిమాలతో బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తుంటాడు కళ్యాణ్. మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఈవెంట్లో పాల్గొంటూ అందరితో కలిసిపోతూ ఉంటాడు. మెగా ఈవెంట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్‌కు అప్డేట్ చేస్తుంటాడు. దీంతో మెగాభిమానులు కళ్యాణ్ దేవ్‌ను ప్రత్యేకంగా ఫాలో అవుతుంటారు.

కళ్యాణ్ దేవ్, శ్రీజలకు ఈమధ్యే ఓ పండంటి బిడ్డ జన్మించింది. నవిష్క అంటూ నామకరణం చేసిన ఈవెంట్, అన్నప్రాసనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా కళ్యాణ్ దేవ్ చేసిన ఓ పోస్ట్ సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేడు (నవంబర్ 11) శ్రీజ పుట్టిన రోజు సందర్భంగా.. బర్త్‌డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నాకు జీవితాంతం ప్రత్యేకమే.. ప్రతీ రోజు సెలెబ్రేట్ చేసుకుంటాము.. కానీ పుట్టినరోజు అనేది ప్రత్యేకం.. హ్యాపీ బర్త్డే శ్రీజ.. అంటూ పోస్ట్ చేశాడు. లవ్, మంచి భాగస్వామి, బెస్ట్ ఫ్రెండ్, నా బలం అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సూపర్‌మచ్చి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











