Kinnerasani Trailer: ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం.. అంచనాలు పెంచిన చిరు అల్లుడు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ ఒకడు. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆ ముద్ర పడకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే 'విజేత' అనే సినిమాతో అతడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. కానీ, నటన పరంగా కల్యాణ్ దేవ్‌కు మంచి మార్కులే పడ్డాయి.

'విజేత' తర్వాత కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల మాత్రం చిత్రీకరణ ఆలస్యం అయింది. దీంతో ఈ సినిమా విడుదల కూడా అనుకున్న సమయానికి కాలేదు. దీంతో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కల్యాణ్ దేవ్ మరో సినిమాను కూడా చేశాడు. అదే 'కిన్నెరసాని'. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది.

Kalyaan Dhev Kinnerasani Movie Trailer Released

'కిన్నెరసాని' మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం కానుకగా వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌తో పాటు పలు పాటలు కూడా విడుదల అయ్యాయి. వాటి అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అదే సమయంలో ఆసక్తి కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది.

కల్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో తాజాగా దీని నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. 'నీ ముందున్న సముద్ర అలల్ని చూడు. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు.. వదులుకోలేదు. నేను కూడా అంతే' అని హీరోయిన్‌, హీరోతో చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత చిన్నగా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. సినిమా నేపథ్యాన్ని చక్కగా చూపించాడు. దీనికి బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరింత బలాన్ని ఇచ్చాయి. ఇందులో కల్యాణ్ దేవ్ ఎంతో పరిణితి చెందిన నటుడిలా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'కిన్నెరసాని' మూవీని రమణ తేజ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కశీష్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, రవీంద్ర విజయ్, షీటల్, మహతీ భిక్షు తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రామ్ తళ్లూరి నిర్మిస్తున్నారు. మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X