క్వారంటైన్ కష్టాలు తప్పాయ్.. ఎట్టకేలకు భార్యకు దగ్గరగా.. కౌగిలింతలో మెగా అల్లుడు బంధీ!

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు తన క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. లాక్ డౌన్‌లో షూటింగ్‌ కోసం బయటకు వెళ్లిన కళ్యాణ్ దేవ్ కరోనా భయంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో ఫ్యామిలీకీ దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు శ్రీజ పెద్ద కూతురు నివృత్తి బర్త్ డేను కూడా సెలెబ్రేట్ చేయలేకపోయాడు. కూతురు పుట్టిన రోజును జరపలేకపోతున్నందున కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ఫ్యామిలీతో కలిసిపోయాడు.

లాక్ డౌన్‌లో షూటింగ్..

లాక్ డౌన్‌లో షూటింగ్..

లాక్ డౌన్‌లో ఇచ్చిన సడలింపుల వల్ల కళ్యాణ్ దేవ తన రెండో ప్రాజెక్ట్ సూపర్ మచ్చిని పూర్తి చేసేందుకు బయటకు వచ్చాడు. కరోనా విజృంభిస్తున్నా షూటింగ్‌లో పాల్గొనడంతో అనుమానం వచ్చి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోందని, కానీ తప్పదని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.

 క్వారంటైన్‌లో కళ్యాణ్ దేవ్..

క్వారంటైన్‌లో కళ్యాణ్ దేవ్..

షూటింగ్ కోసం బయటకు రావడంతో కరోనా వ్యాప్తి చెందుతున్న ఉద్దేశ్యంతో తనకు తాను నిర్భందం విధించుకున్నట్టు పేర్కొన్నాడు. అందుకే క్వారంటైన్‌లో ఉంటున్నాను.. ఈ కమ్రంలోనే తన కూతురు బర్త్ డేను సెలెబ్రేట్ చేయలేకపోతోన్నట్టు చెప్పుకొచ్చాడు.

కూతురిపై ఎమోషనల్..

కూతురిపై ఎమోషనల్..

క్వారంటైన్‌లో ఉన్న కళ్యాణ్ దేవ్ నివృత్తి బర్త్ డే సందర్భంగా చేసిన పోస్ట్ అందర్నీ ఆకట్టుకుంది. ‘ఇది నీ బర్త్ డేనే కావచ్చు.. కానీ నువ్వే నాకు ఓ గిఫ్ట్. నిన్ను చూస్తూ.. నీ ఎదుగుదలను చూస్తూ ఉండటంలో నాకు ఎంతో సంతోషం, ప్రభావం, నా జీవితానికి ఓ అర్థం దొరికినట్టుగా అనిపించింది. నువ్ ఓ అద్భుతమైన కూతురువి మాత్రమే కాదు..ఓ గొప్ప వ్యక్తికి కూడా. ఈ ఏడాది నీవు కోరుకునే ప్రతీ ఒక్కటి నీకు దక్కాలని కోరుకుంటున్నాను బేబీ. హ్యాపీ బర్త్ డే. మనందరం కలుసుకున్న తరువాత మళ్లీ నీ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుందామ'ని చెప్పుకొచ్చాడు.

 కరోనా నెగెటివ్..

కరోనా నెగెటివ్..

క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన కళ్యాణ్ దేవ్ తన ఆరోగ్యం గురించి ఓ అప్ డేట్ ఇచ్చాడు. ‘షూటింగ్ కోసం బయటకు వచ్చిన నాటి నుంచి నేను స్వీయ నిర్భందంలోకి వెళ్లాను. అప్పటి నుంచి ఈ రోజు కోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. నాకు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. నా ఆరోగ్యం గురించి చింతించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ నాకు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని' అని పోస్ట్ చేశాడు.

Recommended Video

Jackpot Movie Hilarious Trailers | Jyothika | Revathi
కౌగిలిలో బంధీ..

కౌగిలిలో బంధీ..

కళ్యాణ్ ఇంకా చెబుతూ.. తాను ఇలాంటి గ్రూప్ హగ్ కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. ఎంతో మిస్ అయ్యానని, మీ అందరినీ ఎంతో ప్రేమిస్తున్నానని ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేశాడు. కుటుంబ సభ్యులందరూ కళ్యాణ్ దేవ్‌ను కౌగిలింతలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X