For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు నాకు దొరికిన గొప్ప బహుమతి.. బర్త్ డే సెలెబ్రేట్ చేయలేకపోవడంపై కళ్యాణ్ దేవ్ ఎమోషనల్

    |

    చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీతో కలిసి సరదాగా ట్రిప్స్ వేస్తాడన్న సంగతి అతని ఫాలోవర్స్‌కు తెలుసు. అంతేకాకుండా శ్రీజ పెద్ద కూతురు నివిృతిని ఎంత బాగా చూసుకుంటాడో అందరికీ తెలిసిందే. నేడు (జూలై 5) నివిృతి బర్త్ డే. ఈ సందర్భంగా కూతురుపై ప్రేమను చాటుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నందుకు బర్త్ డేను సెలెబ్రేట్ చేయలేకపోవడంపై ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    షూటింగ్ వల్లే..

    షూటింగ్ వల్లే..

    ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల వల్ల కళ్యాణ్ దేవ తన రెండో ప్రాజెక్ట్ సూపర్ మచ్చిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. కరోనా విజృంభిస్తున్నా లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే బయటకు వెళ్లి వచ్చిన కారణంగా కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉండాలని ఈ హీరో ఫిక్స్ అయ్యాడట.

    ఫ్యామిలీకి దూరంగా..

    ఫ్యామిలీకి దూరంగా..

    కరోనా వ్యాప్తి చెందుతున్న ఉద్దేశ్యంతోనూ ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడట. అందులో భాగంగానే తన కూతురు బర్త్ డేను సెలెబ్రేట్ చేయలేకపోతోన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈమేరకు కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్, ఫోటోలే ఆమెపై ఉన్న ప్రేమను చాటిచెబుతున్నాయి.

     నువ్వే నాకు బహుమతి..

    నువ్వే నాకు బహుమతి..

    కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఇది నీ బర్త్ డేనే కావచ్చు.. కానీ నువ్వే నాకు ఓ గిఫ్ట్. నిన్ను చూస్తూ.. నీ ఎదుగుదలను చూస్తూ ఉండటంలో నాకు ఎంతో సంతోషం, ప్రభావం, నా జీవితానికి ఓ అర్థం దొరికినట్టుగా అనిపించింది. నువ్ ఓ అద్భుతమైన కూతురువి మాత్రమే కాదు..ఓ గొప్ప వ్యక్తికి కూడా. ఈ ఏడాది నీవు కోరుకునే ప్రతీ ఒక్కటి నీకు దక్కాలని కోరుకుంటున్నాను బేబీ. హ్యాపీ బర్త్ డే. మనందరం కలుసుకున్న తరువాత మళ్లీ నీ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుందామ'ని చెప్పుకొచ్చాడు.

    నమ్మలేనటువంటివి..

    నమ్మలేనటువంటివి..

    శ్రీజ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే మై ఏంజిల్.. పన్నెండేళ్లు వచ్చాయి.. నీవు పంచే అఫెక్షన్, దయాగుణం, ప్రేమ నమ్మలేనటువంటివి. నిన్ను ఏడిపించడమే నాకు ఇష్టం. నేను నిన్ను ఏడిపించడం నీకు ఇష్టమన్ని నిజం నాకు ఎంతో ఇష్టం. ఇంకా ఎన్నో ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాల'ని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.

    English summary
    Kalyaan Dhev Special Wishes To Sreeja Elder Daughter Nivrithi. it maybe your birthday but you are a gift to me nivrithi_k . Watching you grow up had been many things to me, joyful, impactful and one of the most meaningful part of my life!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X