ద్విభాషా చిత్రంగా కళ్యాణ్ దేవ్ చిత్రం.. ఇక్కడ సూపర్ మచ్చి, అక్కడ..?

చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేతగా వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. మాస్ ఎంటర్టైనర్ అంటూ పోకుండా ఓ చక్కటి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ జానర్‌ను ఎంచుకున్నాడు. ఆ చిత్రం కమర్షియల్ విజయం అందుకోకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి. విజేత వచ్చి చాలా కాలమే అవుతున్నా.. తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి తటపటాయిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ మధ్యనే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందనే వచ్చింది. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోని సూపర్ మచ్చి అనే పాట ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే పాటను సినిమా టైటిల్‌గా మార్చుకుని వచ్చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ మూవీ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచిమరో అప్‌డేట్ వచ్చేసింది.

Kalyaan Dhev Super Machi Movie Is Releases In Kannada As Meenakshi

ఈ చిత్రం కన్నడలో కూడా రిలీజ్ కాబోతుంది. కన్నడలో 'మీనాక్షి' అనే టైటిల్‌ పెట్టినట్లు చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X