twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Super Machi Trailer: చూసుకోకుండానే లవ్.. అంచనాలు పెంచేసిన కల్యాణ్ దేవ్

    |

    మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఇప్పుడు స్టార్ స్టేటస్‌ను అందుకుని సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను చేస్తూ హవాను చూపిస్తున్నారు. ఇలా కొంత కాలం క్రితమే మరో హీరో కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అతడే మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్. 'విజేత' అనే సినిమాతో పరిచయం అయిన అతడు.. అందరి దృష్టిలో పడిపోయాడు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. నటుడిగా మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు.

    దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియోదీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

    'విజేత' మూవీ వచ్చిన తర్వాత కల్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' అనే సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పులి వాసు అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయినా.. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయింది. దీనికితోడు హీరోయిన్ మార్పు.. తదితర కారణాలతో రీషూట్లు కూడా జరిగాయి. దీంతో ఈ చిత్రం షూటింగ్ అనుకున్న రీతిలో సాఫీగా సాగలేదు. అంతేకాదు, ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. అందుకు అనుగుణంగానే కల్యాణ్ దేవ్ దీన్ని పక్కన పెట్టేసి మరికొన్ని ప్రాజెక్టులను కూడా మొదలు పెట్టడంతో.. ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ లేదనకున్నారంతా.

     Kalyaan Dhevs Super Machi Movie Trailer Released

    మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి' విడుదల తేదీ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. వాస్తవానికి దీన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించారు. అయితే, సంక్రాంతి రేసులో ఉన్న భారీ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ముందుకు జరిపేసి సంక్రాంతి రేసులో నిలుపుతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. పండుగ కానుకగా ఈ సినిమాను జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అంతేకాదు, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభిచేందుకు ప్లాన్లు చేస్తోంది 'సూపర్ మచ్చి' యూనిట్.

    అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

    కల్యాణ్ దేవ్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సూపర్ మచ్చి' మూవీ నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో, హీరోయిన్లు చూసుకోకుండా ప్రేమించుకోవడం అనే కాన్సెప్టుతో దీన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత హీరోయిన్, హీరో ప్రేమ కోసం పడి చస్తుండడం.. కానీ, అతడు మాత్రం ఆమెను దూరం పెడుతుండడం వంటి సన్నివేశాలను ఫన్నీగా చూపించారు. అనంతరం హీరో ఫ్లాష్‌బ్యాక్‌లో ఫైటింగ్‌లు, గొడవలు వంటివి చూపించారు. ఇక, చివర్లో ఎమోషనల్ సీన్స్‌తో సినిమాలో డెప్త్ ఉందని అర్థం వచ్చేలా చేశారు. మొత్తం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు.

    'సూపర్ మచ్చి' మూవీలో కల్యాణ్ దేవ్ రెండు గెటప్‌లలో కనిపించాడు. ఈ సినిమాను పులి వాసు తెరకెక్కించాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రుచితా రామ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, 'జబర్దస్త్' మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక, ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇది జనవరి 14న విడుదల కాబోతుంది.

    English summary
    Mega Star chiranjeevi son in law Kalyaan Dhev Did Super Machi Movie Under Puli Vasu Direction. Now This Movie Trailer Released
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X