Don't Miss!
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో కళ్యాణ్ దేవ్. విజేత సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ సూపర్ మచ్చి అనే మరో సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక ఆ సినిమా విడుదలకు దగ్గరవుతున్న సమయంలో మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్.
యంగ్ డైరెక్టర్ రమణ తేజ(అశ్వధామ ఫేమ్) దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ లో మరో డిఫరెంట్ సినిమా రాబోతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రాజెక్టును లాంఛనంగా స్టార్ట్ చేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని తులసి వనం శ్రీవెంకటేశ్వర దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విజేత సినిమాతో క్లాసిక్ హిట్ అందుకన్న కళ్యాణ్ ఆ తరువాత మరింత డిఫరెంట్ గా కొత్త కథలతో ఆకట్టుకోవలని అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు మొదలైన ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయితేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించచాడు. ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక దీపావళి కానుకగా నవంబర్ 14న ఉదయం 10గంలకు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.