twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్

    |

    మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సొంతంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్. విజేత సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ సూపర్ మచ్చి అనే మరో సినిమాను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక ఆ సినిమా విడుదలకు దగ్గరవుతున్న సమయంలో మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్.

    యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ లో మరో డిఫరెంట్ సినిమా రాబోతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇటీవల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రాజెక్టును లాంఛ‌నంగా స్టార్ట్ చేశారు.

    Kalyan dhev another project launch in srt entertainments

    హైదరాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని తుల‌సి వ‌నం శ్రీవెంక‌టేశ్వ‌ర దైవ స‌న్నిధానంలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    విజేత సినిమాతో క్లాసిక్ హిట్ అందుక‌న్న కళ్యాణ్ ఆ తరువాత మరింత డిఫరెంట్ గా కొత్త కథలతో ఆకట్టుకోవలని అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు మొదలైన ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించచాడు. ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక దీపావ‌ళి కానుకగా నవంబ‌ర్ 14న ఉద‌యం 10గంల‌కు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లుగా నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.

    English summary
    as-yet-untitled project will be bankrolled by SRT Entertainments and Subham Entertainments. Sai Rashika will be producing this film while Rajani Talluri, and Ravi Chintala will be producing it. Kalyaan Dhev made his debut with content-driven film, Vijetha and will he will be playing a mass role this time around.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X