విడాకుల గోల.. మొదటిసారి అలాంటి పోస్ట్ తో షాక్ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. స్టన్నింగ్ లుక్!
మెగా హీరోలలో అందరూ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నారు. ఇక మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇటీవల అతనికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను శ్రీజ నుంచి దూరంగా ఉంటున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో కనిపించని కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత ఒక స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సోషల్ మీడియాలో
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది. ఇక రెగ్యులర్ గా వీరు సోషల్ మీడియాలో ఎదో ఒక ఫొటో పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. శ్రీజ పెద్ద కుమార్తె అలాగే చిన్న కూతురుకు కూడా ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్స్ ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి

ఇద్దరి మధ్య దూరం..?
ఇక చాలా రోజులుగా శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు కూడా ధూరంగానే ఉంటున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. శ్రీజ హఠాత్తుగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి కళ్యాణ్ అనే పేరును తొలగించడంతో ఆ అనుమానం మొదలయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సోషల్ వెబ్ మీడియాలో వీరికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొట్టాయి.

దూరం పెడుతున్నట్లుగా టాక్..
ఇక అలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా కూడా ఇంతవరకు వారి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అంతే కాకుండా మెగా ఫ్యామిలీలో కూడా ఎవరు వాటిపై పెద్దగా స్పంధించలేదు. ఇక కళ్యాణ్ దేవ్ ను కూడా మెగా హీరోలు దూరం పెడుతున్నట్లుగా టాక్ వచ్చింది. ఎందుకంటే ప్రతీ సారి కళ్యాణ్ దేవ్ సినిమాలకు సంబంధించిన ఎదో ఒక ట్వీట్ వేసే మెగా హీరోలు ఈసారి సూపర్ మచ్చి సినిమాకు సంబంధించిన ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

స్టన్నింగ్ లుక్
ఇక కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక కళ్యాణ్ దేవ్ చాలా రోజుల అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తనపై వస్తున్న ట్రోల్స్ కు కౌంటర్ ఇచ్చాడని అనిపిస్తోంది. అంతే కాకుండా బాడీ ట్రాన్సఫర్మేషన్ తో షాక్ ఇచ్చాడు. ఫుల్ వర్కౌట్స్ తో తన రూపురేఖలను మార్చేసుకున్నాడు.
Recommended Video

నేను చేస్తాను చూడండి..
ఇక సోషల్ మీడియాలో కళ్యాణ్ ఈ విధంగా పోస్ట్ చేశాడు.
నువ్ అలా చేయలేవ్.. ఈ విధంగా చేయలేవ్ అని జనాలు అంటూనే ఉంటారు.. అప్పుడే వారిని చూసి నవ్వుకుని ఇలా తెలియజేయండి.. నేను చేస్తాను చూడండి అని చెప్పేయండి.. అని కళ్యాణ్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. మొత్తానికి కళ్యాణ్ విడాకుల గోలలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే ఎవరు ఏమనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతాను అని వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











