Amigos: మూడు పాత్రల్లో కల్యాణ్ రామ్.. సెన్సేషనల్‌గా అమిగోస్ ఫస్ట్ లుక్
టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ కుటుంబం నుంచి ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది హీరోలు వచ్చారు. అందులో నందమూరి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే విశేషమైన ఫాలోయింగ్, మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు. వాళ్ల తర్వాత ఓ రేంజ్‌లో సక్సెస్ అయింది మాత్రం కల్యాణ్ రామ్ అనే చెప్పాలి. హీరోగా పరిచయం అయిన తర్వాత పెద్దగా విజయాలను అందుకోలేకపోయినా.. వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఫలితంగా అటు హీరోగా, ఇటు నిర్మాతగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇటీవలే నందమూరి కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సోషియో ఫాంటసీ జోనర్‌లో టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే కల్యాణ్ రామ్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను వరుసగా చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఇలా ఇప్పుడు రాజేంద్ర అనే దర్శకుడితో 'అమిగోస్' అనే సినిమాను చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసేసింది.

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న చిత్రమే 'అమిగోస్'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఈ నందమూరి హీరో మూడు పాత్రల్లో దర్శనమిచ్చాడు. ఇక, దీనిపై 'నీలాంటి వాళ్ళని ఇంకొకరిని చూస్తే నువ్వు చచ్చిపోతావని వాళ్ళు చెప్పారు' అనే కొటేషన్ పెట్టారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

విభిన్నమైన కాన్సెప్టుతో రాబోతున్న 'అమిగోస్' మూవీలో కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా అషికా రంగనాథ్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











