NTR30 ఆలస్యం వెనుక అసలు కారణం ఇదే.. త్రివిక్రమ్ తో మరో సినిమా: కళ్యాణ్ రామ్
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమాను మొదలుపెడతాడు అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే నెలలు గడుస్తున్నా ఇంకా ఆ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోవడం అభిమానులకు కాస్త అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో ఈ సినిమా ఆగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని సినిమా తప్పకుండా త్వరలోనే మొదలవుతుంది అని కూడా ఆ మధ్య కొరటాల శివ స్పందించాడు.
అంతేకాకుండా సినిమా జూన్ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ తో మొదలవుతుంది అని కూడా తెలిపారు. కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో కళ్యాణ్ రామ్ అయినా బింబిసార ఇంటర్వ్యూలలో అప్డేట్ ఇస్తాడేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ NTR 30 సినిమా గురించి ఒక వివరణ అయితే ఇచ్చాడు. త్రిబుల్ ఆర్డర్ సినిమా తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.

ఇక ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ఇంకాస్త టైముంది అని కూడా కళ్యాణ్ రామ్ ఫైనల్ గా ఒక వివరణ అయితే ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ మూవీ అనుకోకుండా ఆగిపోయింది అని చెప్పిన కళ్యాణ్ రామ్ తప్పకుండా వారితో మళ్ళీ సినిమా ఉంటుంది అని కూడా తెలియజేశారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి రాబోయే సినిమా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే ఉంటుంది అని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఇక నందమూరి మల్టీస్టారర్ సినిమా చేయాలని మా అందరికి ఉంది అని కాకపోతే దానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ కూడా ఉండాలి అని.. బలమైన నమ్మకమైన స్క్రిప్ట్ వస్తే తప్పకుండా కలిసి సినిమా చేస్తామని కూడా కళ్యాణ్ రామ్ అన్నారు.


Click it and Unblock the Notifications











