Devil Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న డెవిల్.. ఏ సర్టిఫికేట్ వచ్చింది, రన్ టైమ్ ఎంతో తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో విభిన్న కథలతో ప్రేక్షకులు ముందుకు వచ్చే ఈయన తాజాగా మరో అద్భుతమైన సినిమా డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించబోతుంది.
అలాగే శ్రీకాంత్ అయ్యంగర్, సత్య, ఎడ్వర్డ్ సన్నెబ్లిక్, ఎల్నాజ్ నోరౌజి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను 2021 జులై 21వ తేదీన కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ గా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 29వ తేదీన చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే కల్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథ అందించగా... తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తుంగా.. సినిమాటోగ్రాఫర్‌గా సౌందర్ రాజన్ ఎస్, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే డెవిల్ సినిమా రన్ టైమ్ ఎంత, ఏ సర్టిఫికేట్ పొందింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డెవిల్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. అలాగే సినిమా రన్ టైమ్ ను 2 గంటల 26 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వచ్చి అమిగోస్ చిత్రం అట్టర్ ఫ్లాప్ కాగా.. ఈసారి అయినా కచ్చితమైన హిట్టు కొట్టాలనే కసితో డెవిల్ సినిమాతో వస్తున్నారు. మరి ఈ సినిమా అయినా హిట్టుగా నిలిచి కల్యాణ్ రామ్ కెరియర్ కు 2023 హిట్టు ఇస్తుందా లేదా అనేది చూడాలి. గతేడాది బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈయనకు ఈ ఏడాది కూడా ఓ హిట్టు వస్తే బాగుంటుందని కల్యాణ్ రామ్ తో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏ జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











