Bimbisara Trailer: రాక్షసులేరుగని రావణ రూపం.. బింబిసారుడు అంటేనే మరణ శాసనం..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం బింబిసార ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన మొదటి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాను నందమూరి తారక రామ ఆర్ట్స్ పై కే హరికృష్ణ నిర్మిస్తున్నాడు. రాక్షసత్వం నుంచి మంచితనానికి ఉండే ఒక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ గా ఈ సినిమా రాబోతున్నట్లు ముందుగానే చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైన అనంతరం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారా జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు బిబిన్నమైన పాత్రలో అలరించడానికి సిద్ధమయ్యాడు. ప్రపంచాన్ని తన చేతిలోకి తీసుకురావడానికి ఒక వ్యక్తి చేసిన ప్రయోగం అలాగే బింబిసారుడుని మళ్లీ రప్పించాలి అనే పాయింట్ తో ఈ సినిమా రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. ట్రైలర్ మొదట్లోనే కళ్యాణ్ ఎంట్రీ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. రాక్షసులు ఎరుగని రావణ రూపం శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి విశ్వరూపం అంటూ కళ్యాణ్ రామ్ ఎంట్రీ అదిరిపోయేలా చూపించారు.

బింబిసారుడు అంటేనే మరణ శాసనం అంటూ కళ్యాణ్ రామ్ కూడా చాలా పవర్ ఫుల్ గా డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఇక్కడ రాక్షసుడైన దేవుడైన ఈ బింబిసారుడు ఒక్కడే అంటూ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఒక నిధి కోసం బింబిసారుడిని రప్పించాలి అని విలన్స్ చేసే ప్రయోగం ఆ తర్వాత ఎలాంటి వినాశనాలకు దారితీసింది అనేది కూడా ఈ సినిమాలో హైలెట్ కానుందని అర్థమవుతుంది. సినిమాలో యాక్షన్ తో పాటు అడ్వెంచర్ ఫాంటసీ కూడా గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతుంది. తప్పకుండా ఈ సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చే అవకాశం ఉంది ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుతాయి. మరి సినిమా ఇలాంటి రిజల్ట్ ని ఎందుకు ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











