చరిత్రలో రాయని చాప్టర్ తో వస్తున్న నందమూరి హీరో.. మామూలు రచ్చ కాదుగా!
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా సంవత్సరాలుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పటాస్ సినిమా తర్వాత ఆయనకు సరైన హిట్ సినిమా దక్కలేదు.. మధ్యలో కొన్ని సినిమాలు చేశారు కానీ అవి ఏవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఆయన హిట్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుండగా ఆయన కొత్త సినిమా ప్రీ లుక్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికరంగా బింబిసార
ఎలా అయినా ప్రేక్షకులను మెప్పించే సినిమా చేయాలని భావిస్తున్న కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ మాత్రమే కాక ఈ టైటిల్ రివీల్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేసిన వీడియో కూడా ఈ సినిమా మీద అంచనాలు పెంచింది.

బాహుబలిలా
బాహుబలి రూపంలో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడనే చెప్పాలి. శత్రువులను చంపి వారి శవాలను గుట్టగా పేర్చి వాటి మీద కూర్చుని పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఎ టైం ట్రావెల్ ఫ్రొం ఈవిల్ టు గుడ్ అనే ఈవిల్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

బర్త్ డే స్పెషల్
ఇక ఈ సినిమా పూర్తిగా పౌరాణిక అంశాలతో కూడి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఇక మరో పక్క రేపు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న మరో సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

ప్రీ-లుక్ పోస్టర్
ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు సాయంత్రం 4:05 గంటలకు, కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుందని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ రోజు ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ప్రకటించడానికి ఒక ప్రీ-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రీ-లుక్ పోస్టర్‌లో ఒక పీరియడ్ వైబ్ కనిపిస్తోంది.
Recommended Video

చరిత్రలో అలిఖిత అధ్యాయం
ఒక వ్యక్తి, పాతకాలపు దుస్తులు ధరించి, గొడుగు పట్టుకొని రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా స్టీమ్ ట్రైన్ పక్కన కనిపిస్తోంది. ఇక "చరిత్రలో అలిఖిత అధ్యాయం" అని పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయం వెల్లడించకపోయినా, బాబు బాగా బిజీ అనే సినిమాతో ఫేమస్ అయిన నవీన్ మేడారం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమాకు ఆయనే దర్శకుడు అని భావిస్తున్నారు. ఈ అంశం మీద రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











