twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NKR18: కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ.. సోషియో ఫాంటసీ కథతో బిగ్ సర్‌ప్రైజ్‌

    |

    నందమూరి హీరోలలో ఎన్టీఆర్ అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో అత్యదిక స్థాయిలో మార్కెట్ అందుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్నప్పటికి తారక్ రేంజ్ లో మార్కెట్ రాలేదు. ఇక గత కొన్నేళ్లుగా కష్టపడుతున్న కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటిసారి ఒక బిగ్గెస్ట్ సినిమాకు శ్రీకారం చుట్టాడు.

    అయినా కూడా ప్రయోగాలు తగ్గలేదు

    అయినా కూడా ప్రయోగాలు తగ్గలేదు

    కళ్యాణ్ రామ్ మొదటి నుంచి కూడా సొంతంగా ఛాన్సులు అందుకుంటూ నందమూరి బ్రాండ్ తో క్రేజ్ బాగానే అందుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన కథలను టచ్ చేసినప్పటికీ అతని మార్కెట్ వాల్యూ ఇంకా అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. అయినా కూడా కళ్యాణ్ రామ్ ప్రయోగాలు ఏ మాత్రం తగ్గలేదు.

    కొత్త దర్శకులతోనే..

    కొత్త దర్శకులతోనే..

    నందమూరి తారకరామారావు ఆర్ట్స్ లోనే పలు సినిమాలు నిర్మించుకుంటు వస్తున్న కళ్యాణ్ రామ్ ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డితో అతనొక్కడే అలాగే అనిల్ రావిపూడితో పటాస్ వంటి సినిమాలను సొంత బ్యానర్ లో నిర్మించి వారికి మంచి బూస్ట్ ఇచ్చాడు.

    కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ రోల్

    కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ రోల్

    ఇక చాలా కాలం తరువాత మళ్ళీ మరొక కొత్త దర్శకుడితో బారి ప్రయోగానికి సిద్ధమయ్యాడు. వశిష్ట్ అనే కొత్త దర్శకుడితో సోషియో ఫాంటసీ కథను సెట్ చేసే పనిలో బిజీ అయ్యారు. మంచికి చెడుకు మధ్య జరిగిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ నెవర్ బిఫోర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

    స్పెషల్ ఎనౌన్స్మెంట్..

    స్పెషల్ ఎనౌన్స్మెంట్..

    ఇక NKR 18 టైటిల్ ను మే 28న సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎనౌన్స్మెంట్ చేయబోతున్నట్లు ఒక పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. చూస్తుంటే కళ్యాణ్ రామ్ భారీ ప్రయోగానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం 12గంటలకు రిలీజ్ చేయబోయే ఆ టైటిల్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    English summary
    A time travel from Evil to Good. Get ready for the powerful title reveal of the socio fantasy extravaganza #NKR18 on May 28th at 12pm. kalyan ram in a never seen before role
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X