కామసూత్ర హీరోయిన్‌కు కరోనావైరస్.. సానుభూతి తెలిపిన ప్రముఖులు
కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్, భారత సంతతికి చెందిన ఇందిరా వర్మ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇటీవల రోగ నిర్ధారణ పరీక్షలు జరుపగా ఆమెకు కరోనా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దాంతో ఆమెకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.
కొరోనా పాజిటివ్ అనే విషయం తెలియగానే పడకగదికే పరిమితం అయ్యాను. చాలా ఒంటరితనంతో బాధపడతున్నాను. కరోనావైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వారికి తగిన సలహాలు ఇవ్వండి అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఇందిరా వర్మకు కరోనావైరస్ సోకిందనే వార్త తెలియగానే పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె కరోనా వైరస్ సోకిందనే విషయం చాలా బాధగా ఉంది. త్వరలోనే కోలుకోవాలని కోరుకొంటున్నాం అని పలువురు సన్నిహితులు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడిన వారిలో హాలీవుడ్‌కు చెందిన టామ్ హాంక్స్, రీటా విల్సన్, ఇద్రీస్ ఎల్బా, ఓగ్లా కరిలెంకో, రాచెల్ మ్యాథ్యూస్ తదితరులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ఇందిరా వర్మ కూడా చేరారు.
హాలీవుడ్‌లో రాణిస్తున్న ఇందిరా వర్మకు భారత సంతతి మూలాలు ఉన్నాయి. తండ్రి ఇండియన్ కాగా, తల్లి స్విస్ దేశస్థురాలు. 1996లో కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్, 2004లో బ్రైడ్ అండ్ ప్రిజ్యుడీస్ అనే చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











