28 ఏళ్ల తర్వాత మళ్లీ రాబోతున్న లోకనాయకుడి మ్యూజికల్ హిట్ మూవీ.. ఏది, ఎప్పుడు రీరిలీజ్ కాబోతుందంటే?
ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 28 ఏళ్ల క్రితం వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ మూవీయే భారతీయుడు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా చేసిన ఈ సినిమాలో మనీషా కోయిరా, సుకన్య, ఊర్మిలలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. కమల్ హాసన్ ద్విపాత్రిభినయం చేసిన ఈ సినిమా తాజాగా రీరిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా థియేటర్లలోనే మళ్లీ విడుదల కాబోతుంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా ఇండియన్ కు అనువాదమే భారతీయుడు. కమల్ హాసన్ డబుల్ యాక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మనీషా కోయిరాల, నెడుముడి వేణు, ఊర్మిళ, సుకన్య, కస్తూరి శంకర్, భానుప్రియ, సెంథిల్, గౌండమణి జానీ లీవర్, అరుణ ఇరానీ, రోహిణి, మనోరమ, అజయ్ రత్నం, పొన్నంబాలం, క్రేజీ మోహన్, సుద, మహానంది శంకర్, బాలా సింగ్, సాగర్ సాలుంకి, విక్రమ్ ధర్మ, చొక్కలింగ భాగవతర్ వంటి వాళ్లంతా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా.. జీవా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే బి లెనిన్, వి.టి విజయన్ లు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను 1996 మే 9వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కేవలం సినిమా మాత్రమే కాదండోయ్.. అందులోని పాటలు కూడా అదుర్స్ అనిపించాయి.
ముఖ్యంగా అదిరేటి డ్రస్సు మీరేస్తే, మాయా మచ్ఛీంధ్ర, పచ్చని చిలుకలు తోడుంటే, టెలిఫోన్ ధ్వనిలా, తెప్పలెల్లి పోయాకా వంటి పాటలన్నీ ఆల్ టైమ్ హిట్లుగా నిలిచాయి. ఇంత అద్భుతమైన సినిమా దాదాపు 28 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని నేరుగా మూవీ టీంయే తెలిపింది. జూన్ 7వ తేదీ రోజు ఈ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అంతా ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో చూడాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యం... వెంటనే ఈ క్రేజీ మూవీని చూసేందుకు ప్లాన్ చేసుకోండి.


Click it and Unblock the Notifications











