Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శృతి హాసన్‌ని పెద్దగా పట్టించుకోను.. మా అక్క గురించి చెప్పాలంటే: అక్షర హాసన్
సీనియర్ హీరో కమల్ హాసన్ కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హీరోయిన్లుగా వెండితెరపై రాణిస్తున్నారు. ఇప్పటికే శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకోగా, అక్షర హాసన్ ఇప్పుడిప్పుడే కెరీర్ గాడిలో పెట్టుకుంటోంది. సొంత అక్కచెల్లెలు హీరోయిన్లుగా చెలామణి కావడం చాలా అరుదు. గ్లామర్ ప్రపంచం అన్నాక ఎన్నో హీరోయిన్లకు సంబంధించి ప్రతీ విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తుంటారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్‌ని తన అక్క శృతి హాసన్ గురించిన ప్రశ్నలు వేశారు. అయితే వాటిపై ఆసక్తికరంగా రియాక్ట్ అయింది అక్షర.
తన సొంత అక్కే అయినప్పటికీ శృతి హాసన్ విషయాల్లో తాను అస్సలు జోక్యం చేసుకోనని చెప్పింది అక్షర హాసన్. తన విషయాల్లో కూడా అక్క శృతి వేలు పెట్టదని, లాగే తాను కూడా అక్క విషయాలు పట్టించుకోనని ఆమె చెప్పింది. అయితే కొన్ని సందర్భాల్లో సినిమాలకు సంబందించిన విషయాలు మాత్రం చర్చించుకుంటామని, ఇంతకంటే అక్క గురించి చెప్పాలంటే తన దగ్గర ఏదీ లేదని తెలిపింది అక్షర హాసన్. రానున్న రోజుల్లో దర్శకురాలిని కావాలని ఉందని ఈ సందర్బంగా ఆమె చెప్పింది.
ఇక అక్షర హాసన్ కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం 'కడరం కొండాన్' తెలుగులో 'మిస్టర్ కేకే' పేరుతో విడుదల కానుంది. రాజేశ్ సెల్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్ కుమారుడు అభి అక్షరకు జోడీగా నటిస్తున్నాడు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అకీరా అనే చాలెంజింగ్ పాత్రలో నటించింది అక్షర హాసన్.
మరోవైపు ప్రియుడు మైకేల్ కొర్సలేతో ఇన్నాళ్లు డేటింగ్ చేసిన శృతి హాసన్.. ఇటీవలే ఆయనకు బ్రేకప్ చెప్పేసింది. చాలా కాలం తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ 'లాభం' అనే సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా నటిస్తోంది శృతి. దీంతో పాటు రవితేజ సరసన మరో తెలుగు సినిమాలో కూడా శృతి నటిస్తోందని సమాచారం.