తమ్ముడు గర్వంగా ఉంది.. పవన్ కల్యాణ్ ప్రభంజనంపై కమల్ హాసన్ ట్వీట్ వైరల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ ఒక్కరు జనసేనాని విజయాన్ని తమ విజయంగా భావిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా విలక్షణ నటుడు, ఇండియన్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్ గురించి ఆయన ఏమన్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 శాతం విజయం సాధించడం ఓ రికార్డుగా మారింది. ఆయన పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ సీట్లలో జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించడం తెలిసిందే.

Kamal Haasan Emotional Message to pawan Kalyan after Massive Win in Andhra Pradesh Elections 2024

ఇక పవన్ కల్యాణ్ సాధించిన విజయంపై కమల్ హాసన్ శుభాకాంక్షలు అందించారు. తన ట్వీట్‌లో.. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌తో జరిగిన సంభాషణ చాలా ఎమోషనల్‌గా సాగింది. ఆయన గెలుపునకు ప్రశంసలు అందిస్తూ కంగ్రాట్యులేషన్ తెలియజేశాను అని తెలిపారు.

ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు, వారి సంక్షేమానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ నడుచుకొంటారని, అలాగే వారి కలలను సాకారం చేస్తారని బలంగా విశ్వసిస్తున్నాను. ప్రజలకు మంచి సేవ చేస్తారని నేను నమ్ముతున్నాను. తమ్ముడు నిన్ను చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది అంటూ కమల్ హాసన్ ట్వీట్‌లో అన్నారు.

Kamal Haasan Emotional Message to pawan Kalyan after Massive Win in Andhra Pradesh Elections 2024

కమల్ హాసన్ విషయానికి వస్తే.. తమిళనాడులో రాజకీయ పార్టీని ప్రారంభించి.. గత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ దారుణంగా పరాజయం పొందారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాలను నిలిపివేసి.. డీఎంకేకు మద్దతు తెలిపారు.

ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన రెండు చిత్రాలు కూడా రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. పాన్ ఇండియా టార్గెట్‌తో రిలీజ్ అవుతున్న భారతీయుడు, అలాగే కల్కి 2898ఏడి సినిమాలు జూన్, జూలైలో రిలీజ్ కానున్నది. మరికొన్ని సినిమాలు షూటింగులో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X