Balakrishna 50: బాలకృష్ణపై కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్!

సినీ పరిశ్రమలో 50 ఏళ్ల్ ప్రస్థానం కొనసాగించిన నందమూరి బాలకృష్ణకు తెలుగు సినిమా పరిశ్రమ అరుదైన వేడుకను నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ఈ వేడుకకు భారీగా సినీ ప్రముఖులు తరలి వచ్చారు. యువ, సీనియర్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో కమల్ హాసన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

ఈ వేడుకలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, కందులు దుర్గేష్, తమన్, సుమలత, దిల్ రాజు, మంచు విష్ణు, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, సిద్దూ జొన్నలగడ్డ, అల్లరి నరేష్, అడివి శేష్, ఎంపీ భరత్, టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు, నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్ తదితరులు హాజరయ్యారు.

Kamal Haasan emotional Video Speech about Balakrishna 50 Years of Telugu Film Industry

బాలయ్య 50 ఏళ్ల స్రస్థాన వేడుకలో పాల్గొనాలని విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు ఆహ్వానం పంపారు. అయితే కొన్ని ముందస్తు అపాయింట్స్ వల్ల ఈ వేడుకకు రాలేకపోయానని ఆయన తెలిపారు. నేను రాలేకపోయినందుకు చింతిస్తున్నాను అంటూ ఓ వీడియోను బాలయ్య కోసం పంపారు.

కమల్ హాసన్ ఈ వీడియోలో మాట్లాడుతూ.. బాలకృష్ణ సంస్కారం చాలా గొప్పది. ఆయనను అందరూ ఆ విషయంతో గుర్తుపెట్టుకుంటారు. బాలయ్య మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే. ఆయన తండ్రి ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టం. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బావుండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.

బాలయ్యపై కమల్ హాసన్ తన ఇష్టాన్ని, తన అభిప్రాయాలను వీడియో ద్వారా వెల్లడించడం ద్వారా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. బాలయ్య ఆ వీడియో చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆద్యంతం అత్యంత ఉత్సాహంతో ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, కమల్ హాసన్ ఇటీవల తెలుగు సినిమా కల్కి 2898 AD తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో పాత్ర ద్వారా మరోసారి విభిన్నమైన నటనను ప్రదర్శించి ఎప్పటిలానే ఆకట్టుకొన్నారు. కల్కి 2 సినిమా కోసం ఎదురు చూసేలా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X