శంకర్‌ని రిక్వస్ట్ చేసిన కమల్ హాసన్.. షూటింగ్‌కి బ్రేక్!

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇటీవల భారతీయుడు 2 చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. సమాజంలో జరిగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా బలమైన కథ రూపొందించినట్లు శంకర్ ఇటీవల తెలిపారు.

ఇప్పటికే భారతీయుడు 2 చిత్రానికి సంబంధించిన రెండు కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి. భారతీయుడు 2 షూటింగ్ కి కొన్నిరోజులు బ్రేక్ పడనుంది. కమల్ హాసన్ ఆ మధ్యన మక్కళ్ నీధి మైయాం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ కూడా బరిలోకి దిగబోతోంది.

Kamal Haasan gives break to Indian 2 movie shoot for political campaign

ఈ నేపథ్యంలో పార్టీ ప్రచారంలో కమల్ హాసన్ పాల్గొనబోతున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వాలని కమల్ శంకర్‌ని రిక్వస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X