Just In
- 20 min ago
'సరిలేరు నీకెవ్వరు' మండే సర్ప్రైజ్.. అదరగొట్టేస్తున్న మూడో పాట
- 54 min ago
'శివ 143' సాంగ్ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్.. చిన్న సినిమాకి పెద్ద ప్రోత్సాహం
- 1 hr ago
మహేష్, బన్నీ అభిమానుల రచ్చ రచ్చ.. మొగుడు, మగాడు అంటూ ఒకరిపై ఒకరు!
- 2 hrs ago
మెగా 152: వైరల్ అవుతున్న చిరంజీవి లుక్.. లీక్ అయినట్లేనా?
Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ క్రికెట్లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షం
- News
దిశ నిందితులను చంపినట్టే హాజీపూర్ సైకో శ్రీనివాసరెడ్డిని చంపాలని డిమాండ్.. గవర్నర్ కు వినతిపత్రం
- Technology
కొత్తగా 'క్యాప్షన్ వార్నింగ్' ఫీచర్ ను ప్రారంభించిన ఇన్స్టాగ్రామ్
- Finance
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్స్
- Automobiles
కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించనున్న మెర్సిడెస్ బెంజ్
- Lifestyle
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మహేష్ బాబు ట్వీట్‌కు ఆలస్యంగా స్పందించిన కమల్ హాసన్.. సూపర్‌స్టార్‌పై ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియా లో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటాడు. ప్రతీ విషయంపై స్పందిస్తూ అందర్నీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఏదైనా సినిమా వీక్షించినప్పుడు, అది నచ్చితే సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ ఉంటాడు. తోటీ హీరోల పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసి వారిని విష్ చేస్తూ ఉంటాడు. తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పుట్టినరోజు (నవంబర్ 7) సందర్భంగా ఓ ట్వీట్ చేశాడు.

గురువు విగ్రహాన్ని ప్రతిష్టించిన కమల్..
ఈ పుట్టినరోజుకు ప్రత్యేక సందర్భంగా ఉండటంతో ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు లోకనాయకుడు. సినీ జీవితంలో అడుగు పెట్టి అరవై యేళ్లు గడవడంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన గురువైన కె బాలచందర్ విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

విషెస్ చెప్పిన మహేష్..
కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ట్వీట్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీకి మీరు చేసిన సేవలు అసాధారణం.. నటుడిగా అరవై యేళ్లు గడిచినందుకు కంగ్రాట్స్.. ఇది నిజంగా స్ఫూర్తి వంతం.. ఈ ఏడాది మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి.. పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.
|
ఆలస్యంగా రిప్లై ఇచ్చిన కమల్..
మహేష్ విషెస్‌కు కమల్ హాసన్ కాస్త ఆలస్యంగా రిప్లై ఇచ్చాడు. ఈ మేరకు కమల్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు మహేష్ జి. నువ్వు కూడా కెరీర్‌ని చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి అద్భుతమైన నీ కెరీర్ లో గొప్ప ఎత్తులను అందుకుంటున్నావు. నీ శుభాకాంక్షల ను నేను గౌరవప్రదం గా స్వీకారిస్తున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్" అంటూ మహేష్ కెరీర్ పట్ల తను ఎంతో ఆనందంగా ఉన్నాన'ని తెలిపాడు.

రీట్వీట్ చేసిన మహేష్..
కమల్ హాసన్ ఆలస్యంగా స్పందించినా.. మహేష్ మాత్రం వెంటనే రిప్లై ఇచ్చాడు. కమల్ ట్వీట్‌కు మహేష్ రిప్లై ఇస్తూ.. ధన్యవాదాలు సర్.. ఎల్లప్పుడు మీపై మాకు ప్రేమా గౌరవం ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్‌లొ బిజీగా ఉన్నాడు.