కమల్ హాసన్ ఉగ్రరూపం.. వైరల్‌గా ఇండియన్ 2 రెండో పోస్టర్!

రజనీకాంత్‌తో 2.O మూవీని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్2 చిత్రానికి శ్రీకారం చుట్టారు. గత కొద్దినెలలుగా శంకర్ ఇండియన్ 2 స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 17న ఇండియన్ 2 సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇండియన్ 2 సినిమాకు సంబంధించి ఇది రెండో పోస్టర్. ఇండియన్ 2 చిత్రం జనవరి 18న సెట్స్ పైకి వెళ్తుందని శంకర్ ట్వీట్ చేశారు.

సేనాధిపతి లుక్‌తో కమల్ ఉగ్రరూపంతో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఓల్డర్, వైజర్, డెడ్లియర్ అనే పదాలను పోస్టర్‌పై ముద్రించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై శుభకరణ్ నిర్మిస్తున్నాడు. 1996లో రిలీజైన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతున్నది.

 Kamal Haasan looks Deadlier for Indian2

ఇండియన్ 2 చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నది. హీరో సిద్ధార్థ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం శింబును ఎంపిక చేయగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారు.

ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచంద్రర్ సంగీతం, రవివర్మన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X