ఇద్దరు సూపర్ స్టార్స్ తో అట్లీ మల్టీ స్టారర్.. పాన్ ఇండియా మూవీలో హీరోలు ఎవరంటే?
యంగ్ అండ్ టాలెంటెండ్ డైరెక్టర్ అట్లీ. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో క్రేజీ డిమాండ్ ఉంది. తమిళంలో పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించగా.. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రియల్ గా అట్లీ-షారుక్ కాంబోలో వచ్చిన 'జవాన్'మూవీ మాత్రం అదుర్స్.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. మూవీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపించింది. ఎంతగా అంటే.. దాదాపు రూ.1143 కోట్లకి పైగా వసూల్ సాధించింది. ఈ మూవీ భారీ హిట్ కావడంతో సౌత్ నుంచి నార్త్ వరకు స్టార్స్ క్యూ కడుతున్నారు. ఆయనతో వర్క్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ తరుణంలో ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతుంది. ఇటు సౌత్ అటు నార్త్ సూపర్ స్టార్స్ ను కలుపుతూ డైరెక్టర్ అట్లీ ఓ భారీ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారంట. ఇంతకీ ఈ పాన్ ఇండియా మూవీలో హీరోలు ఎవరంటే? మీరు కూడా ఓ లూక్కేయండి.
గత కొంతకాలంగా డైరెక్టర అట్లీ భారీ బడ్జెట్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ గురించి సల్మాన్ ఖాన్‌తో చర్చిస్తున్నట్లు తెలిసిందే. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సల్మాన్ ఖాన్ తో పాటు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కమల్ హాసన్ తో కూడా చర్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కథను సల్మాన్ ఖాన్ తో దాదాపు మూడు నెలల క్రితమే జరిగారంట. స్క్రిప్ట్‌ను కూడా సల్మాన్‌కి వివరించాడంట. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట సాల్ భాయ్. మల్లీ స్టారర్ గా వస్తున్న ఈ యాక్షన్ మూవీ కోసం తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ సంప్రదించారంట. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కథను కమల్ విన్నడనీ, ఆమోదం కోసం మూవీ మేకర్స్ ఎదురు చూస్తున్నారంట.. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి ప్రారంభించాలని అట్లీ భావిస్తున్నాడు. అక్టోబర్‌లో ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించాలని భావిస్తున్నారట మూవీ మేకర్స్.



Click it and Unblock the Notifications











