twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలు ఆరోగ్యం మరింత విషమం.. కమల్ హాసన్ కీలక ప్రకటన

    |

    ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ క్రమంలో ఎంజీఎం హాస్పిటల్‌లో ప్రముఖుల రాకపోకలతో హడావిడిగా మారింది. కమల్ హాసన్ లాంటి ప్రముఖులు హాస్పిటల్‌కు వెళ్లి ఎస్పీ బాలసుబ్రమణ్యంను, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఎంజీఎం హాస్పిటల్‌ నుంచి వెళ్తూ మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ ఆయన ఆరోగ్య బాగుందని చెప్పను. ఆయన కోలుకోవాలని నేను కోరుకొంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రార్థిస్తున్నారు అని తెలిపారు

    ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో ఎంజీఎం హాస్పిటల్‌కు వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. కేవలం 20 మందిని మాత్రమే ఎస్పీ బాలసుబ్రమణ్యం వార్డు వెళ్లే అనుమతించారు. ఈ క్రమంలో అభిమానుల్లో, సన్నిహితుల్లో ఆందోళన మొదలైంది. ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించిందన్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్తున్నారు.

     Kamal Haasan statement about SP SP Balasubrahmanyam

    ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులెటిన్‌‌ను ఎజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో విడుదల చేస్తూ.. ఎస్పీబాలు ఆగస్టు 5న ఎంజీఎం హెల్త్‌కేర్‌లో కరోనావైరస్ వ్యాధితో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎక్మో, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. గత 24 గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. పూర్తిగా ఆయనకు లైఫ్‌ సపోర్ట్‌తోనే చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది అని పేర్కొన్నారు.

    English summary
    MGH Health Bulletin on SPB: SP Charan shared a video about sp balasubrahmanyam health condition: Son Charan confirms. Earlier Hospital sources released that, Legendary singer SP Balasubrahmanyam who was tested coronavirus positive recently his health condition is critical condition and he is on life support. MGH releases Health Bulletin on SPB says very critical since 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X