Indian 2 ఎట్టకేలకు ఇండియన్ 2 రిలీజ్.. కమల్ హాసన్ మూవీ విడుదల ఎప్పుడంటే?

లోకనాయకుడు, విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 (భారతీయుడు 2) చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. గత కొన్నేండ్లుగా షూటింగ్ జరుపుకొంటూ.. పలుమార్లు షూటింగులు వాయిదా పడుతూ అసలు సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా వివాదం కోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులను అధిగమించి భారతీయుడు 2 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా విడుదల తేది ఎప్పుడంటే?

భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీలో మరోసారి స్వతంత్ర సమరయోధుడు సేనాపతి పాత్రలో కమల్ హాసన్ పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను శంకర్ తనదైన శైలిలో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను జూన్ 2024 సంవత్సరంలో రిలీజ్ చేసేందుకు లైకా ప్రొడక్షన్ నిర్ణయం తీసుకొన్నది.

Kamal Haasan s Indian 2 official Release date announced When Kajal movie coming to Theatres

జూన్‌లో ఇండియన్ 2 సినిమా రిలీజ్ అవుతున్నదని లైకా అధికారికంగా ప్రకటించి పోస్టర్‌ను రిలీజ్ చేసింది. రెండు చేతులు వెనుకకు పెట్టుకొన్న కమల్ హాసన్ ప్రెజెన్స్ పోస్టర్‌లో అదిరిపోయింది. తెల్లటి దుస్తుల్లో మిలమిల మెరుస్తూ కనిపించాడు. తలపై తెల్లని జుట్టు చూడగానే గొప్ప తత్వవేత్తగా ఇంటెన్స్ లుక్‌తో కనిపించారు.

దేశానికి క్యాన్సర్ వ్యాధిలా పట్టి పీడిస్తున్న అవినీతి, అన్యాయాలపై సేనాపతి పోరాటం ఎలా ఉండబోతున్నది. శంకర్ ఈ క్యారెక్టర్‌ను ఎలా డిజైన్ చేశాడునే ఆసక్తికరంగా అభిమానులను ఎదురు చూసేలా చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య తదితరులు నటిస్తున్నారు. ఈసినిమాకు శంకర్ స్క్రీన్ ప్లేను జయమోహన్‌తో కలిసి అందించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించారు.

నటీనటులు: కమల్ హాసన్, ఎస్ జే సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సుముద్రఖని, బాబీ సింహా, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, జాకీర్ హుస్సేన్, పియూష్ మిశ్రా, గురు సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయప్రకాశ్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు
దర్శకత్వం: శంకర్
మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫి: రవి వర్మన్
ఆర్ట్: ముత్తురాజ్
స్టంట్స్: అనల్ అరసు
నిర్మాత: సుభాస్కరన్
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X