Thug Life First Look కమల్ హాసన్ లుక్ గూస్‌బంప్స్.. ఆ సినిమాకు కనెక్షన్?

లోకనాయకుడు కమల్ హాసన్.. ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇప్పటికే విక్రమ్ సినిమాతో సూపర్ హిట్టును అందుకున్న ఈ హీరో... ఇప్పుడు మణిరత్నంతో కలిసి మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. మణిరత్నం కమల్ హాసన్ దాదాపు 36 ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తున్నారు. ఇక తాజాగా ఆ మూవీకి సంబంధించిన టైటిల్ ను రివిల్ చేశారు. ఇక దానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ చూశాక.. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే...

కమల్‍హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‍లో 36 ఏళ్ల తర్వాత ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇక నవంబర్ 7న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఈరోజు చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇది కమల్ హాసన్ 234వ చిత్రంగా తెరకెక్కుంది. ఇక వర్కింగ్ టైటిల్ KH234 గా ఇప్పటి వరకు కార్యక్రమాలు జరుపుకుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. ఓ చిన్న గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

 Kamal Hassan Mani Ratnam Movie Title is Thug Life and Gimps Released

మణిరత్నం, కమల్ హాసన్ సినిమాకు థగ్స్ లైఫ్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ వీడియోతో పాటు.. ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు.. అనేది కూడా రివిల్ చేశారు. ఇక ఆ గ్లింప్స్ చూస్తే.. ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ పక్కా.. దానికి తోడు ఆ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ అని చెప్పవచ్చు.

 Kamal Hassan Mani Ratnam Movie Title is Thug Life and Gimps Released

థగ్స్ లైఫ్ సినిమాలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే పాత్రలో నటిస్తున్నాడు కమల్ హాసన్. ఇక గ్లింప్స్ స్టార్టింగ్ లోనే కమల్ మాట్లాడుతూ... "నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు అంటూ కమల్ హాసన్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక కమల్ హాసన్ ను కొంత మంది దుండగులు దూసుకువస్తారు. వారందరినీ కమల్ హాసన్ తన కత్తితో చంపేస్తాడు.

ఇక ఈ యాక్షన్ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరిలో కూడా తన పేరు చెప్తూ వీడియోను ముగిస్తారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ గెటప్ విభిన్నంగా ఉంది. 1987లో కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్‍లో వచ్చిన నాయకన్ సినిమాలో కమల్ క్యారెక్టర్ పేరు వేల్ నాయకర్. ఈ సినిమాలో కమల్ పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్... దీంతో ఆ చిత్రానికి.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా అని నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఒకరు కాగా.. తమిళ హీరో జయం రవి మరొకరు. థగ్ లైఫ్ సినిమాను కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్.. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X