Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ గోపాల్ వర్మకు షాక్.. తనదే హవా అనుకుంటే సీన్ రివర్స్!
రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన అప్డేట్స్ ద్వారా ఇన్నాళ్లు రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తూ సంచలనం సృష్టించిన వర్మకు.. ఇప్పుడు సెన్సార్ బోర్డు షాకుల మీద షాకులిస్తోంది. దీంతో సీన్ రివర్స్ అయింది. వివరాల్లోకి పోతే..
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి
ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరలేపారు వర్మ. ఈ సినిమా విడుదల సమయంలో పలు అవాంతరాలు వచ్చినప్పటికీ, చివరకు విడుదలకు నోచుకుంది. దీంతో అదే బాటలో మరో సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను రూపొందించాడు వర్మ. కానీ ఇప్పుడు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా మారింది పరిస్థితి.
Recommended Video
సెన్సార్ బోర్డు అడ్డు.. వాయిదా వేసిన వర్మ
ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేసి రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారిన వర్మ.. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతలో ఈ సినిమాపై కేసులు పడటం, సెన్సార్ బోర్డు అడ్డు పడటం కారణంగా విడుదలను వాయిదా వేశారు.
వివాదాస్పద సీన్స్.. 90 కట్స్
ఈ మేరకు తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు వర్మ. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కరుణించలేదు. సినిమాలో చాలా అభ్యంతరకర సీన్స్ ఉన్నాయని, మొత్తం మీద 90 కట్స్ చేసి సినిమాను విడుదల చేసుకోవచ్చని చెప్పిందట సెన్సార్ బోర్డు.
వర్మ రియాక్షన్.. కష్టమే మరి!
తన సినిమాలో 90 సీన్స్ తీసేయడం అంటే ఏకంగా సినిమాలో జీవమే తీసేయినట్లు అని వర్మ అంటున్నాడట. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, కుల సామాజిక వర్గంపై కూడా ఎక్కువగా సెటైర్లు వేస్తూ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. సో ఈ సినిమా ఎప్పుడు విడుదలకు నోచుకుంటుందో చూడాలి మరి.