twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మకు షాక్.. తనదే హవా అనుకుంటే సీన్ రివర్స్!

    |

    రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తన అప్‌డేట్స్ ద్వారా ఇన్నాళ్లు రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తూ సంచలనం సృష్టించిన వర్మకు.. ఇప్పుడు సెన్సార్ బోర్డు షాకుల మీద షాకులిస్తోంది. దీంతో సీన్ రివర్స్ అయింది. వివరాల్లోకి పోతే..

    అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి

    అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి

    ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరలేపారు వర్మ. ఈ సినిమా విడుదల సమయంలో పలు అవాంతరాలు వచ్చినప్పటికీ, చివరకు విడుదలకు నోచుకుంది. దీంతో అదే బాటలో మరో సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను రూపొందించాడు వర్మ. కానీ ఇప్పుడు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్నట్లుగా మారింది పరిస్థితి.

    Recommended Video

    #CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
    సెన్సార్ బోర్డు అడ్డు.. వాయిదా వేసిన వర్మ

    సెన్సార్ బోర్డు అడ్డు.. వాయిదా వేసిన వర్మ

    ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల చేసి రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారిన వర్మ.. ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతలో ఈ సినిమాపై కేసులు పడటం, సెన్సార్ బోర్డు అడ్డు పడటం కారణంగా విడుదలను వాయిదా వేశారు.

    వివాదాస్పద సీన్స్.. 90 కట్స్

    వివాదాస్పద సీన్స్.. 90 కట్స్

    ఈ మేరకు తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు వర్మ. అయినప్పటికీ సెన్సార్ బోర్డు కరుణించలేదు. సినిమాలో చాలా అభ్యంతరకర సీన్స్ ఉన్నాయని, మొత్తం మీద 90 కట్స్ చేసి సినిమాను విడుదల చేసుకోవచ్చని చెప్పిందట సెన్సార్ బోర్డు.

     వర్మ రియాక్షన్.. కష్టమే మరి!

    వర్మ రియాక్షన్.. కష్టమే మరి!

    తన సినిమాలో 90 సీన్స్ తీసేయడం అంటే ఏకంగా సినిమాలో జీవమే తీసేయినట్లు అని వర్మ అంటున్నాడట. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, కుల సామాజిక వర్గంపై కూడా ఎక్కువగా సెటైర్లు వేస్తూ సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం. సో ఈ సినిమా ఎప్పుడు విడుదలకు నోచుకుంటుందో చూడాలి మరి.

    English summary
    Ram Gopal Varma revealed that he has received numerous threat calls from unidentified people from foreign destinations after he announced his new film Kamma Rajyam Lo Kadapa Redlu. Now he decided to change the title as Amma Rajyamlo Kadapa Biddalu. But censor not parmited to realese the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X