కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: చంద్రబాబు, బాలకృష్ణ, పవన్, కేసీఆర్, జగన్.. వర్మ ఎవరినీ వదల్లేదుగా.!

Recommended Video

Kamma Rajyam Lo Kadapa Reddlu Title Song

రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు చిరునామా. తరచూ ఏదో ఒక పని చేసి వార్తల్లో నిలుస్తుంటాడు ఈ బడా డైరెక్టర్. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈయన.. కొద్దిరోజులుగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. సినిమాలు తీయడంలోనూ.. సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ ఆయన అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కొద్దిరోజులుగా ఆయన రాజకీయాలపైనా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో వచ్చారు. ఇది ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ, ఊహించని విధంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పాటను విడుదల చేస్తానని ప్రకటించాడు.

ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్

ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్

ఈ సినిమా పాటను విడుదల చేస్తానని గురువారం వర్మ ట్వీట్ చేశాడు. అందులో ‘ద మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను తొమ్మిదో తారీఖు, తొమ్మిది గంటలకు విడుదల చేస్తాను' అని పేర్కొన్నాడు. అంతేకాదు ఇది వివాదాస్పదం కాదని చంద్రబాబు మీద ఒట్టేసి చెబుతున్నానన్నాడు. దీంతో అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

సాంగ్ రిలీజ్

వర్మ చెప్పినట్లే కరెక్ట్ టైమ్‌కు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశాడు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చూపించాడు. అలాగే అసెంబ్లీ సెషన్స్‌లో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేపై జగన్ ఫైర్ అవడం కూడా ఉంది. వీటితో పాటు కేసీఆర్‌ను కలవడం సహా ఎన్నో సన్నివేశాలను ఈ పాటలో ఉంచాడు.

కథ ఇదేనంటూ ప్రకటన

కథ ఇదేనంటూ ప్రకటన

రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు.

 మిశ్రమ స్పందన

మిశ్రమ స్పందన

రాంగోపాల్ విడుదల చేసిన పాటపై మిశ్రమ స్పందన వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దీనికి మద్దతు తెలుపుతుండగా, చంద్రబాబు.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ పాటపై విమర్శలు చేస్తున్నారు. రెండు కులాలను వాడుకుని, రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X