కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్: వర్మ ఆటం బాంబ్.. ఏ ఒక్కరినీ వదల్లేదు

Recommended Video

Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer || RGV || Sirasri || Ravi Shankar || #KRKRTrailer

సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి రాజకీయ వర్గాలపై ఆటం బాంబ్ విసిరాడు వర్మ. వివరాల్లోకి పోతే..

ఎప్పుడో చెప్పాడు.. ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు

ఎప్పుడో చెప్పాడు.. ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడు

వాస్తవానికి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వక పోవడంతో అంతా లైట్ తీసుకున్నాడు. కానీ ఊహించని విధంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టి షాకుల మీద షాకులిస్తున్నాడు ఈ వివాదాస్పద వీరుడు.

 సినీ, రాజకీయ వర్గాల్లో కుదుపు

సినీ, రాజకీయ వర్గాల్లో కుదుపు

ఇందులో భాగంగానే తాజా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశాడు. దాదాపు మూడు నిమిషాల నిడివితో.. ఎప్పటిలాగే వర్మ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తి రేపేలా ఉంది. తనదైన మార్క్ చూపిస్తూ వర్మ కట్ చేసిన ఈ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ సినీ, రాజకీయ వర్గాలను ఓ కుదుపు కుదిపేసిందని చెప్పుకోవచ్చు.

వాళ్లనే టార్గెట్ చేసి..

వాళ్లనే టార్గెట్ చేసి..

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ బాంబులు విసిరాడు వర్మ. ఈ ట్రైలర్ చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వం లోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఏర్పడిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్థమవుతోంది.

బ్రేకింగ్ న్యూస్ అంటూ బాబు పేరు వాడేశాడు

బ్రేకింగ్ న్యూస్ అంటూ బాబు పేరు వాడేశాడు

''బ్రేకింగ్ న్యూస్.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పార్టీ, చరిత్రలోనే ఎవరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తరువాత.. కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయి'' అంటూ ఏపీ రాజకీయ పరిస్థితుల్ని హింసాత్మకంగా చూపిస్తూ సరికొత్త సంచలనానికి తెరలేపాడు రామ్ గోపాల్ వర్మ.

ట్రైలర్‌లో హైలైట్ సన్నివేశాలు

‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు' అని చంద్రబాబు పాత్ర పోషిస్తున్న నటుడు చెప్పడం, ‘ఇక ప్రశ్నించే ప్రసక్తిలేదు.. చేయడమే' అంటూ పవన్ కళ్యాణ్ రోల్‌లో నటించిన నటుడు డైలాగ్ కొట్టడం, ఇక నారా లోకేష్ పాత్ర పోషిస్తున్న నటుడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఏడుస్తూ అన్నం తింటూ ఉండటం ఈ ట్రైలర్ లో హైలైట్ సన్నివేశాలు.

రాజకీయ ప్రకంపనలు ఖాయమేనా?

రాజకీయ ప్రకంపనలు ఖాయమేనా?

తాజాగా విడుదలవుతున్న ఈ అప్‌డేట్స్ చూస్తుంటే.. వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించగా.. వర్మ సహ దర్శకుడిగా వ్యవహరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X